తెలంగాణ

telangana

ETV Bharat / priya

నోరూరించే తవా రోస్ట్‌ చికెన్‌ డ్రమ్‌స్టిక్స్‌ - చికెన్‌

చికెన్ అంటే మాంసాహార ప్రియులకు యమా ఇష్టం. ఇక డ్రమ్​స్టిక్స్​ను చూస్తే తినకుండా ఉండలేరు. మరి ఈ కరోనా కాలంలో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే నోరూరించే తవా రోస్ట్​ చికెన్ డ్రమ్​స్టిక్స్​ చేసుకొని ఆరగించేయండి. తయారీ విధానం మేం చెబుతాం..

chicken recipes
చికెన్‌ డ్రమ్‌స్టిక్స్‌

By

Published : Jul 20, 2021, 12:00 PM IST

తవా రోస్ట్‌ చికెన్‌ డ్రమ్‌స్టిక్స్‌

చికెన్‌ డ్రమ్‌స్టిక్స్‌

కావాల్సినవి:చికెన్‌ లెగ్స్‌- నాలుగు, ఉప్పు-తగినంత, కారం, అల్లంవెల్లుల్లి పేస్ట్‌- రెండు చెంచాల చొప్పున, ధనియాల పొడి, గరంమసాలా- చెంచా చొప్పున, పసుపు- చిటికెడు, పెరుగు- కప్పు, నిమ్మరసం-పెద్ద చెంచా, నూనె- రెండు పెద్ద చెంచాలు, ఆరెంజ్‌ కలర్‌- పావు చెంచా.

తయారీ: చికెన్‌ లెగ్స్‌ను శుభ్రంగా కడిగి గాట్లు పెట్టాలి. ఆ తర్వాత గిన్నెలో వేసుకుని తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లంవెల్లుల్లి ముద్ద, గరంమసాలా, నిమ్మరసం, ఆరెంజ్‌ కలర్‌ వేసి చికెన్‌ లెగ్స్‌కి పట్టించాలి. ఈ మిశ్రమాన్ని గంటసేపు నానబెట్టాలి.

నాన్‌స్టిక్‌ తవాలో నూనె వేసి వేడిచేయాలి. అందులో చికెన్‌ లెగ్స్‌ వేసి మంటను మధ్యస్థంగా పెట్టి అయిదు నుంచి పది నిమిషాలపాటు వేయించుకోవాలి. ఇప్పుడు చిన్నమంటపై లెగ్‌ పీసెస్‌ను అన్నివైపులా తిప్పుతూ పావుగంటపాటు రోస్ట్‌ అయ్యేవరకు వేయించాలి. వేగిన చికెన్‌ డ్రమ్‌ స్టిక్స్‌ను వేడి వేడిగా సర్వ్‌ చేసుకోవాలి.

ఇదీ చూడండి:Paneer recipes: పసందైన పనీర్‌ విందు!

ABOUT THE AUTHOR

...view details