తెలంగాణ

telangana

ETV Bharat / priya

'పెసర చెగోడీలు' కరకరలాడిద్దామిలా...!

ఇంటికి అనుకోకుండా బంధువులు వచ్చినప్పుడు, పిల్లలు చిరుతిళ్లు కావాలని మారాం చేసినప్పుడు ఏం వండాలో అర్థం కాదు. మరి అలాంటప్పుడు టక్కున చెగోడీలు చేసుకుంటే ఎలా ఉంటుంది.? మరి ఎంతో ఈజీగా తయారయ్యే చెగోడీలను పెసరపప్పుతో ఇంకాస్త ఆరోగ్యంగా చేసుకుందాం రండి..!

By

Published : Aug 31, 2020, 1:01 PM IST

pesara chegodi or chekodi recipe at home
'పెసర చెగోడీలు' కరకరలాడిద్దామిలా...!

'పెసర చెగోడీలు' అంటే నోరూరని వారుంటారా? కానీ, అవి మెత్తగా సాగుతూ ఉంటే రుచించదు. మరి కరకరలాడే 'పెసర చెగోడీలు' చేసుకోవడం ఎలాగో రెసిపీ చూసేయండి...

కావాల్సినవి

పెసరపిండి - కప్పు,

వరిపిండి - రెండుటేబుల్‌స్పూన్లు,

జీలకర్ర - చెంచా,

కారం - చెంచా,

ఉప్పు - సరిపడా,

నూనె - వేయించడానికి సరిపడా.

తయారీ

మొదట పెసరపిండి, వరిపిండి, కారం, జీలకర్ర, ఉప్పు అన్నింటినీ కలగలిపి గట్టి పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు చేతికి కొద్దిగా నూనె రాసుకుని కొంచెం కొంచెం పిండి తీసుకొని సన్నగా, పొడుగ్గా కాడల్లా చేసుకుని గుండ్రంగా అంచులు జతచేసుకోవాలి. తరవాత వాటిని కాగుతున్న నూనెలో వేయిస్తే సరిపోతుంది. కరకరలాడే చెగోడీలు సిద్ధం.

ఇదీ చదవండి: కమ్మగా 'బ్రెడ్‌దోశ'.. చిటికెలో తయారవ్వగా!

ABOUT THE AUTHOR

...view details