రెస్టారెంటులోనో, ఏదైనా పార్టీలోనో తృప్తికరమైన భోజనం తిన్న వెంటనే గుర్తొచ్చేది సోంపు. సోంపు గింజలతో తాజా శ్వాస అనుభూతి పొందుతారు. రిఫ్రెష్ అవుతారు. ఉబ్బరం, జీర్ణక్రియ సమస్యలను ఈ గింజలు తగ్గిస్తాయి. ఇటువంటి ఎన్నో ఔషధ విలువలున్న సోంపును భారతీయులు విరివిగా ఉపయోగిస్తుంటారు.
ఈ వేసవి కాలంలో భానుడి సెగల నుంచి ఉపసమనం పొందాలంటే.. వీటితో 'సోంపు షర్బత్' తయారు చేసుకొని తాగండి చాలు.
కావాల్సిన పదార్థాలు
రాత్రంతా నానబెట్టిన సోంపు(1/3 కప్పు) , చక్కెర 2 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టీ స్పూన్, మిరియాలు 1 టీ స్పూన్, ఐసు ముక్కలు తగినన్ని, జీలకర్ర పొడి 1 టీస్పూన్, నిమ్మకాయ, పుదీనా ఆకులు.