తెలంగాణ

telangana

ETV Bharat / priya

టొమాటో పులిహోర.. ఇలా కలపండి.. అలా తినేయండి - పులిహోర కలిపే విధానం

మనమందరం పులిహోరను చాలా సార్లు రుచి చూసి ఉంటాం. ఒక్కసారైనా ఇంట్లో పులిహోర తయారు చేసే ఉంటాం. మరి ఈ సారి కొత్తగా టొమాటోతో పులిహోర కలిపేయండి.

food news
కమ్మని టొమాటో పులిహోర కలిపేద్దామిలా!

By

Published : Nov 5, 2020, 1:22 PM IST

వేడిగా ఉన్నా, చల్లగా ఉన్నా... తినగానే ఆహా అనిపించే వంటకం పులిహోర. ఆ రుచి నాలుకకు తగలాలని కోరుకునేవారు ఎందరో. మరి మీక్కూడా ఆ రుచి చూడాలని ఉంటే ఆలస్యం చేయకుండా కిచెన్​లోకి వెళ్లండి. కమ్మని పులిహోర తయారు చేసుకోండి. అయితే ఇప్పుడు మనం చూసేది మామూలు పులిహోర కాదండోయ్.. టొమాటో పులిహోర. ఏంటి? ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నారా?

కావలసినవి:

బియ్యం: పావుకిలో, టొమాటోలు: పావుకిలో, చింతపండు గుజ్జు: టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి: ఆరు, ఇంగువ: చిటికెడు, వేరుసెనగ పప్పు: 3 టేబుల్‌స్పూన్లు, సెనగపప్పు: 2 టేబుల్‌ స్పూన్లు, మినప్పప్పు: 2 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: తగినంత, ఎండుమిర్చి: నాలుగు, ఆవాలు: టీస్పూను, నూనె: 100 మి.లీ., కరివేపాకు: నాలుగు రెబ్బలు, పసుపు: టీస్పూను

తయారుచేసే విధానం:

టొమాటోలు, పచ్చిమిర్చి ముక్కలుగా కోసి ఉడికించాలి. చల్లారాక చింతపండు గుజ్జు చేర్చి మెత్తగా రుబ్బాలి.అన్నం ఉడికించి పక్కన ఉంచాలి.వెడల్పాటి బాణలిలో ఉడికించిన అన్నంలో టొమాటో గుజ్జు మిశ్రమాన్ని వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి.బాణలిలో నూనె పోసి వేరుసెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, పసుపు వేసి వేయించాలి. తరవాత కరివేపాకు కూడా వేసి వేగాక ఈ తాలింపును టొమాటో గుజ్జు కలిపిన అన్నంలో వేసి కలపాలి.

ABOUT THE AUTHOR

...view details