నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా ఇష్టపడే వంటకాల్లో మటన్ ముందుంటుంది. మటన్ ముక్కలతో బిర్యానీ చేసుకోవచ్చు, కర్రీ తయారు చేయొచ్చు. అలాగే తలకాయ పలుసుతో పాటులెగ్ పీస్లతో పాయను సిద్ధం చేసుకుని రుచి చూడొచ్చు. ఇది చాలా బలవర్ధకమైన ఆహారం. ఈ పాయ తింటే శరీరానికి కావాల్సిన కాల్షియం లభిస్తుందని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో మటన్ పాయను సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
నూనె - మూడు టీ స్పూన్లు
ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు
నల్ల యాలకులు - 2
యాలకులు -2
దాల్చిన చెక్క - 1
అనాస పువ్వు -1
మిరియాలు - 1 టీస్పూన్
లవంగాలు - 3
జీలకర్ర - 1/2 టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
మేక కాళ్లు - 1 కప్పు
కారం - 1 టీస్పూన్
ధనియాల పొడి - 1/2 టీస్పూన్
ఉప్పు - తగినంత
తయారీ విధానం
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేడి అయ్యాక.. సాజీర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ధనియాల పొడి, కారం వేసి తగినంత ఉప్పు వేయాలి. అందులో మేకకాళ్లు కూడా వేసి నీళ్లు పోసుకుని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. బాగా ఉడికాక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే హైదరాబాదీ మటన్ పాయ రెడీ.