కొవిడ్-19 కట్టడిలో భాగంగా చేతులను ఎప్పటికప్పుడు సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటున్నాం. అలాగే పండ్లు, కూరగాయలపైనా మరింత శ్రద్ధ అవసరం. బయట నుంచి తీసుకొచ్చే పండ్లు, కూరగాయల విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాలి. అలాగని వాటిని సబ్బుతోనో, సర్ఫుతోనో అస్సలు కడగొద్దు. ఈ మధ్య పండ్లు, కూరగాయలను వీటితో కడిగినట్లు పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదేదో బాగుందని అలా చేస్తే లేనిపోని ఇబ్బందులు తెచ్చుకున్నట్లే.
పండ్లు, కూరగాయలను శుభ్రం చేసేయండిలా... - కొవిడ్-19
కరోనా నియంత్రణ కోసం తరచుగా సబ్బులు, శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకుంటున్నాం. మరి పండ్లు, కూరగాయల సంగతి ఏంటి? వాటిని ఎలా శుభ్రం చేయాలో తెలుసా?
![పండ్లు, కూరగాయలను శుభ్రం చేసేయండిలా... how to wash fruits and vegetables](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6785323-997-6785323-1586850659673.jpg)
పండ్లు, కూరగాయలనూ శుభ్రం చేసేయండిలా!
మరి ఇంతకీ ఎలా శుభ్రం చేయాలి అంటే..
- నల్లా నీటి కింద కూరగాయలను ఉంచి శుభ్రం చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
- నీటిలో కాస్త ఉప్పు వేసుకొని శుభ్రపరుచుకోవచ్చు.
- నీళ్లలో కొద్దిగా వెనిగర్ లేదా నిమ్మరసం, కొద్దిగా బేకింగ్ సోడా కలిపి కూరగాయలను శుభ్రం చేసుకుంటే మంచిది. దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావం ఉండదు.
- క్యారెట్లు, పుచ్చ, దోసకాయలను అవసరమనుకుంటే స్క్రబ్బింగ్ బ్రష్ ఉపయోగించి కడగొచ్చు.
ఇదీ చదవండి:లాక్డౌన్ 2.0పై రేపు మార్గదర్శకాలు- 3 జోన్లుగా భారత్!