తెలంగాణ

telangana

ETV Bharat / priya

పసందైన 'చికెన్ 65' బిర్యానీ చేద్దామిలా! - చికెన్ 65 బిర్యానీ టేస్ట్

బిర్యానీల్లో ఎన్నో రకాలు ఉన్నా.. దేనికి అవే సాటి. కానీ, చికెన్ 65 బిర్యానీ రుచి మాత్రం డిఫరెంట్​. దాని తయారీ విధానం ఎలాగో చూద్దాం.

chicken biryani
చికెన్ బిర్యానీ

By

Published : Aug 29, 2021, 7:01 AM IST

ఏ కుటుంబంలోనైనా చిన్నా, పెద్దా అంతా ఇష్టంగా తినేది బిర్యానీ. వెజ్, చికెన్, మటన్, రొయ్యలు, చేపలు.. ఇలా ప్రతి దాంతో బిర్యానీ చేసుకోవచ్చు. కానీ 'చికెన్ 65'తో బిర్యానీ ఎపుడైనా ట్రై చేశారా!. తింటే మాత్రం.. 'వహ్వా' అనాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వంటకం తయారీ విధానాన్ని చూసేయండి.

కావాల్సిన పదార్థాలు.. (తగిన మోతాదులో)

చికెన్ ముక్కలు, కరివేపాకు, పుదీనా, బియ్యపు పిండి, కారం, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, గుడ్డు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కొత్తిమీర.

తయారీ విధానం..

ముందుగా ఒక బౌల్​లో చికెన్​ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరిగిన కరివేపాకు, సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర, సరిపడా ఉప్పు, కార్న్​ఫ్లోర్, బియ్యపు పిండి, కారం, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, గుడ్డు వేసి బాగా కలుపుకొని వేడి నూనెలో వేసి డీప్​ ఫ్రై చేసుకుని పక్కన పెట్టాలి.

ఇప్పుడు ఒక బాణీలో నూనె వేడి చేసి.. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు, సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా, పెరుగు, సరిపడా నీళ్లు, ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి బాగా కలిపి 10 నిమిషాలు ఉడకబెట్టాలి. ఆ తర్వాత ముందుగానే వేయించి పక్కన పెట్టిన చికెన్ 65 ముక్కలను గిన్నెలో వేసి మరో 10 నిమిషాలు ఉడికిస్తే.. చికెన్ 65 బిర్యానీ రెడీ.

ఇదీ చదవండి:నోరూరించే పన్నీర్​ దమ్​ బిర్యానీ.. చేసుకోండిలా

ABOUT THE AUTHOR

...view details