తెలంగాణ

telangana

ETV Bharat / priya

'రాగి బెల్లం దోశ'తో ఆరోగ్యం పదిలం! - how to make dosha with ragi

ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచే.. రాగులతో ఎన్నో వెరైటీ వంటకాలు చేయవచ్చు. తరచూ మినప పిండితో వేసే దోశలను.. రాగిపిండితో కూడా చేయవచ్చు. అదెలాగో మీరే చూడండి.

Ragi Bellam Dosha
'రాగి బెల్లం దోశ

By

Published : Aug 29, 2021, 4:17 PM IST

రాగులతో చేసే ఏ వంటకమైనా.. శరీరానికి కావాల్సిన శక్తిని అందించి.. ఆరోగ్యాన్ని పది కాలల పాటు పదిలంగా ఉంచుతుంది. అలాగే చలికాలంలో వచ్చే అలర్జీలకు చెక్​ పెడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటితో తయారు చేసే ఆహారపదార్థాలను తినడానికి కొందరు అయిష్టత ప్రదర్శిస్తారు. అటువంటి వారికి కాస్త డిఫరెంట్​గా రాగిపిండితో చేసే 'రాగి బెల్లం దోశ' పెట్టేయండిలా..

కావాల్సినవి

రాగిపిండి ఒక కప్పు, బ్రౌన్​రైస్​ పౌడర్​ 2 టీస్పూన్లు, బెల్లం నీళ్లు ఒక కప్పు, పచ్చికొబ్బరి తురుము 2 టీస్పూన్లు, యాలుకలపొడి పావు టీస్పూన్​, నెయ్యి అర టీస్పూన్​, ఉప్పు తగినంత, వాల్​నట్​ 2 టీస్పూన్లు.

తయారు చేసే విధానం

ముందుగా గిన్నెలో రాగిపిండి, బ్రౌన్​రైస్​, కొబ్బరితురుము, ఉప్పు, బెల్లం నీళ్లు వేసి బాగా కలపాలి. అనంతరం పాన్​కు కాస్త నెయ్యి రాసి.. దానిపై కలిపిన రాగిపిండిని దోశలా వేసుకోవాలి. దానిపై వాల్​నట్​పొడిని వేసి ఎర్రగా కాల్చుకోవాలి. అంతే రాగి బెల్లం దోశ రెడీ.

ఇదీ చూడండి:పసందైన 'చికెన్ 65' బిర్యానీ చేద్దామిలా!

ABOUT THE AUTHOR

...view details