తెలంగాణ

telangana

ETV Bharat / priya

కార్న్​ మసాలా చేసేద్దామిలా!

లాక్​డౌన్​ వల్ల బయటకు వెళ్లట్లేదా.. ఇంట్లో ఖాళీగా ఉండటానికి విసుగు చెందుతున్నారా. అయితే ఇక ఆలస్యం చేయకుండా మీకు నచ్చిన ఆహారం ఇంట్లోనే చేసేయండి. ఎప్పుడూ బయటకు వెళ్లి ఉడికించిన కార్న్​కు కారం, నిమ్మకాయ పెట్టినవి తింటుంటారు కదా.. ఈ సారి కాస్త కార్న్​ కర్రీ చేసేద్దాం.

corn masala preparation method
కార్న్​ మసాలా చేసేద్దామిలా!

By

Published : Apr 14, 2020, 7:54 PM IST

కార్న్​ ఉడికించి కాస్త కారం, నిమ్మకాయ పూసి తింటే ఆ రుచే వేరు. ఈసారి కాస్త భిన్నంగా కార్న్​ కూర చేసేద్దామా.. ఇంతకీ కూర ఏంటీ అనుకుంటున్నారా. అదేనండీ కార్న్​ మసాలా.. ఇంతకీ దీన్ని ఎలా చేయాలో తెలుసా!

కార్న్​ మసాలా చేయడానికి కావాల్సిన పదార్థాలు

మొక్కజొన్న గింజలు - కప్పు

నూనె - టేబుల్​ స్పూను

జీలకర్ర, మినపపప్పు, శెనగపప్పు - చెంచా చొప్పున

కరివేపాకు - రెండు రెబ్బలు

పచ్చిమిర్చి - 2

ఉల్లిపాయ - 1

వెల్లుల్లి - రెండు రెబ్బలు

అల్లం తరుగు - చెంచా

కొబ్బరి తురుము - అరకప్పు

పసుపు - అరచెంచా

కారం - చెంచా

ధనియాల పొడి - రెండు చెంచాలు

ఉప్పు - తగినంత

చింతపండు రసం - 3 చెంచాలు

బెల్లం తరుగు - చెంచా

గరం మసాలా - చెంచా

నిమ్మరసం - కొద్దిగా

మసాలా కోసం..

లవంగాలు - 8

మిరియాలు - చెంచా

యాలకులు - 6

ధనియాలు - టేబుల్​ స్పూను

జీలకర్ర - టేబుల్​ స్పూను

దాల్చిన చెక్క - చిన్న ముక్క

తయారీ విధానం

- ముందుగా మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలన్నింటినీ నూనె లేకుండా వేయించి తీసుకోవాలి. వేడి చల్లారాక పొడిలా చేసుకోవాలి.

- బాణలిని పొయ్యి మీద పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక జీలకర్రా, మినపపప్పు, శెనగపప్పు వేయించాలి.

- రెండు నిమిషాలయ్యాక కరివేపాకూ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలూ, అల్లం, వెల్లుల్లి తరుగు వేయాలి.

- ఉల్లిపాయలు వేగాక కొబ్బరి తురుము కలపాలి. కొబ్బరి పచ్చివాసన పోయాక పసుపు, కారం, ధనియాల పొడి, ముందుగా తయారు చేసుకున్న మసాలా, తగినంత ఉప్పూ, కాసిని నీళ్లూ, చింతపండు రసం, బెల్లం తరుగు, మొక్కజొన్న గింజలు వేయాలి. ఆ గింజలు ఉడికాయనుకున్నాక గరం మసాలా, నిమ్మరసం వేసి దింపేస్తే చాలు.

ఇదీ చదవండి:'లాక్​డౌన్​ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో?'

ABOUT THE AUTHOR

...view details