తెలంగాణ

telangana

ETV Bharat / priya

ఈ కేక్స్​తో క్రిస్మస్​ వెరీ వెరీ స్పెషల్ - తిన్నారంటే వావ్ అనాల్సిందే!

Christmas 2023 Special Cakes: క్రిస్‌మస్‌ మొదలుకుని కొత్త సంవత్సరం ఆరంభం వరకూ ఎక్కడ చూసినా కేక్స్​ హడావుడే ఉంటుంది. ఇదే అదనుగా బేకరీ వాళ్లు రేట్లు కూడా పెంచేస్తారు. అంతేకాదు.. క్వాలిటీలో కూడా తేడా ఉండొచ్చు. మరి.. అలాంటప్పుడు బేకరీలకు వెళ్లడం ఎందుకు? ఇంట్లో సూపర్ క్వాలిటీతో టేస్టీ కేక్ తయారు చేసుకుంటే అద్దిరిపోతుంది కదా!

Christmas Special Cakes
Christmas 2023 Special Cakes

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 3:00 PM IST

Christmas 2023 Special Cakes: క్రిస్మస్‌ అనగానే గుర్తొచ్చేది అందమైన క్రిస్మస్‌ ట్రీ, శాంతా క్లాజ్ గిఫ్ట్స్​తోపాటు నోరూరించే స్పెషల్‌ కేక్స్‌. పిల్లల దగ్గరి నుంచీ పెద్దల వరకూ ఎంతో ఇష్టంగా తినే కేక్స్‌ను చాలా మంది బేకరీ నుంచి కొనుక్కుంటారు. అయితే ఈసారి మీరే ఇంట్లో సూపర్ కేక్ రెడీ చేయండి. మరి ఇంకెందుకు లేట్​..? ఎలా తయారుచేయాలో చూసేద్దాం రండి..!

క్రిస్మస్‌ స్పెషల్‌ కేక్‌:

కావాల్సిన పదార్థాలు:

  • మైదా- కప్పు,
  • వాల్‌నట్స్‌- 2 చెంచాలు(సన్నగా తరిగినవి),
  • బేకింగ్‌ పౌడర్‌- 1/2 టీస్పూన్​
  • ఎండుద్రాక్షలు- మూడు చెంచాలు
  • టూటీ ఫ్రూటీ- 4 చెంచాలు
  • బ్రౌన్‌ పంచదార- కప్పు
  • వెనిలా ఎసెన్స్‌- 4చుక్కలు,
  • ఎగ్స్​- 3,
  • వెన్న- అరకప్పు,
  • లెమన్‌ జెస్ట్‌ (నిమ్మకాయపైన ఉండే తొక్క )- చెంచా,
  • చెర్రీస్‌- 2 చెంచాలు(సగానికి కోసినవి) గార్నిషింగ్‌ కోసం

మీ పిల్లలకు కేక్స్ అంటే ఇష్టమా? - అయితే నోరూరించే ఎగ్​లెస్ రవ్వ కేక్ ఇంట్లోనే తయారు చేసేయండిలా!

తయారీ విధానం:

  • ఓవెన్‌ 160 డిగ్రీ సెల్సియస్‌లో 10 నిమిషాల పాటు ప్రీ హీట్​ చేసుకోవాలి.
  • తర్వాత ఓ బౌల్​ తీసుకుని మైదా, బేకింగ్‌ పొడిని కలిపి జల్లెడ పట్టుకోవాలి.
  • అందులో వాల్‌నట్స్‌ తురుము, ఎండుద్రాక్షలు, టూటీఫ్రూటీలు వేసి కలపాలి.
  • మరో పాత్రలో వెన్న, బ్రౌన్‌ షుగర్‌ వేసి బాగా కలపాలి. ఇది బాగా క్రీమ్‌లా తయారయ్యే వరకూ మిక్స్‌ చేసుకొని.. అందులో వెనీలా ఎసెన్స్‌, ఎగ్స్​, లెమన్‌ జెస్ట్‌ వేసి బాగా గిలకొట్టాలి.
  • ఈ మిశ్రమంలో ఇప్పుడు మైదా, బేకింగ్‌ సోడా మిశ్రమాన్ని వేసి, బాగా కలపాలి.
  • తర్వాత ఓ కేక్‌టిన్‌ తీసుకుని వెన్న లేదా నెయ్యి రాసుకోవాలి.
  • అందులో సిద్ధం చేసి పెట్టుకున్న కేక్‌ మిశ్రమాన్ని పోసుకొని బబుల్స్​ లేకుండా టాప్​ చేయాలి.
  • తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న అవెన్​లో 30 నుంచి 40 నిమిషాలు బేక్‌ చేసుకోవాలి.
  • తర్వాత కేక్​ టిన్​ చల్లారిన తర్వాత డీమౌల్డ్​ చేసుకోవాలి. అంతే.. క్రిస్మస్‌ స్పెషల్‌ కేక్‌ తినడానికి రెడీ.
  • దీన్ని స్లైస్​ గా కట్‌ చేసి ముక్కలు చేసుకున్న తర్వాత చెర్రీలను గార్నిష్‌ చేసుకొని సర్వ్‌ చేసుకోవాలి.

రెస్టారెంట్​ స్టైల్లో​ చికెన్​ 65 - ఇలా చేశారంటే వావ్ అనాల్సిందే!

ఇటాలియన్‌ క్రీమ్‌ కేక్‌:

కావల్సిన పదార్థాలు:

  • మజ్జిగ – కప్పు
  • బేకింగ్‌ సోడా - టీస్పూన్‌
  • బటర్​– కప్పు
  • పంచదార– రెండు కప్పులు
  • ఎగ్స్​ - 5
  • వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - టీస్పూన్‌
  • కోకొనట్‌ ఫ్లేక్స్‌(సూపర్‌ మార్కెట్‌లో దొరుకుతుంది) - కప్పు
  • మైదా - రెండు కప్పులు
  • బేకింగ్‌ పౌడర్‌ - టీస్పూన్‌
  • బేకింగ్‌ ప్యాన్లు - మూడు

Nellore Chepala Pulusu Recipe in Telugu: నోరూరించే నెల్లూరు చేపల పులుసు.. ఇలా చేశారంటే టేస్ట్​ సూపర్​.. ప్లేటు నాకాల్సిందే..!

ఫ్రాస్టింగ్‌ కోసం

  • క్రీం చీజ్‌ - కప్పు
  • వెన్న – అర కప్పు
  • వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌ - టీస్పూన్‌
  • విప్డ్‌ క్రీం - రెండు టేబుల్‌ స్పూన్లు
  • చక్కెర పొడి– నాలుగు కప్పులు
  • తరిగిన వాల్‌నట్స్‌ - అర కప్పు
  • స్వీటెన్డ్‌ కోకొనట్‌ ఫ్లేక్స్‌ - కప్పు

How to Prepare Methi Mutton Curry : మటన్​ ఎప్పుడూ ఒకేలా ఏం తింటారు..? ఈ సండే ఇలా ట్రై చేయండి!

తయారీ విధానం:

  • ముందుగా ఓవెన్‌ను 350 డిగ్రీల ఫారన్‌హీట్‌కు ప్రీహీట్‌ చేసుకోవాలి.
  • ఒక గిన్నెలో మజ్జిగ, బేకింగ్‌ సోడాని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలో వెన్న, చక్కెర వేసి బాగా కలుపుకొని, గుడ్లు ఒక్కొక్కటిగా వేసుకొని బాగా కలుపుకోవాలి.
  • తరువాత అందులోకి వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, కోకోనట్‌ ఫ్లేక్స్‌, బేకింగ్‌ పౌడర్‌, మైదా, మజ్జిగ వేసి ఉండల్లేకుండా కలుపుకోవాలి.
  • ఇప్పుడు బేకింగ్‌ ప్యాన్​ను కొద్దిగా వెన్నతో గ్రీజ్‌ చేసుకొని, ఈ కేక్‌ మిశ్రమాన్ని పోసుకొని, అవెన్‌లో 30-35 నిమిషాల పాటు బేక్‌ చేసుకోవాలి.
  • టూత్‌పిక్‌తో గుచ్చితే కేక్‌ మిశ్రమం అంటుకోకుండా వస్తే, కేక్‌ తయారైనట్లే. ఇప్పుడు కేక్స్‌ను ఒవెన్‌లోనుంచి బయటకుతీసి చల్లార్చుకోవాలి.
  • ఈలోపు ఫ్రాస్టింగ్‌ తయారుచేసుకోవాలి. దీనికోసం, క్రీం చీజ్‌, వెన్న, వెనీలా ఎక్స్‌ట్రాక్ట్‌, విప్డ్‌ క్రీం, షుగర్​ పౌడర్​ వేసి బాగా స్మూత్‌గా కలుపుకోవాలి. తరువాత, తరిగిన వాల్‌నట్స్‌, స్వీటెన్డ్‌ కోకొనట్‌ ఫ్లేక్స్‌ వేసి కలుపుకుంటే ఫ్రాస్టింగ్‌ క్రీం రెడీ.
  • ఇప్పుడు చల్లారిన కేక్​ను 3 లేయర్స్​గా రౌండ్​గా కట్​ చేసుకోవాలి.
  • తర్వాత ఓ కేక్​ లేయర్​ను రౌండ్​ ప్లేట్​లోకి తీసుకుని.. తయారుచేసుకున్న క్రీంను కేక్‌పై అప్లై చేసుకోవాలి.
  • దీనిపై మరో కేక్‌ లేయర్​ను పెట్టుకొని మళ్లీ క్రీంను అప్లై చేయాలి.
  • ఆ తర్వాత మిగిలిన కేక్‌ లేయర్​ను పెట్టి క్రీంను కేక్‌ చూట్టూ గార్నిష్‌ చేసుకోవాలి. అంతే.. ఎంతో రుచికరమైన ఇటాలియన్‌ క్రీమ్‌ కేక్‌ రెడీ!

How to Make Chepala Pulusu in Telugu: చేపల పులుసు ఇలా చేశారంటే.. గిన్నె ఊడ్చాల్సిందే..!

Telangana Special Natukodi Curry : తెలంగాణ స్టైల్లో నాటుకోడి కర్రీ.. మసాలా నషాళాన్ని తాకాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details