Christmas 2023 Special Cakes: పుట్టినరోజు.. పెళ్లిరోజు.. అకేషన్ ఏదైనా కేక్ కంపల్సరీ. పిల్లల నుంచి పెద్దల వరకూ ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. అయితే.. కేక్ కావాలంటే బేకరీకి వెళ్లాల్సిందే. అయితే.. ఈ సారి కొనుగోలు చేయడం ఆపేయండి. మీకు నచ్చిన ఫ్లేవర్‌లో మీరే సూపర్ కేక్ రెడీ చేయండి. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి.
కొబ్బరి కేక్:కావల్సిన పదార్థాలు :
- కొబ్బరి తురుము-1 కప్పు
- తేనె -1/2 కప్పు
- నూనె-1/2 కప్పు
- గుడ్లు-6
- వెనీలా ఎసెన్స్-1 టీస్పూన్
- బేకింగ్ పౌడర్-1 టీస్పూన్
- ఉప్పు-చిటికెడు
తయారీ విధానం:
- ముందుగా మీరు ఓవెన్‌ను 180 డిగ్రీల సెల్సియస్ వద్ద 10 నిమిషాల పాటు ప్రీ హీట్ చేయాలి. ఓవెన్ లేని వారు స్టౌ మీద అడుగు లోతుగా ఉండే ఓ మందపాటి గిన్నె తీసుకుని అందులో కొంచెం ఇసుక లేదా ఉప్పు పోసి.. ఓ చిన్న స్టాండ్ లేదా ప్లేట్ పెట్టుకుని 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఓ బౌల్ తీసుకుని.. అందులో గుడ్లు వేసుకుని బాగా బీట్ చేయాలి. తర్వాత కొబ్బరి తురుము, తేనె, నూనె, వెనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి కట్ అండ్ ఫోల్డ్ విధానంలో కలుపుకోవాలి.
- ఇప్పుడు మీరు కేక్ మౌల్డ్ తీసుకుని దానికి కొంచెం నూనె రాసి కొద్దిగా మైదాపిండి చల్లుకోవాలి.
- తర్వాత మీరు రెడీ చేసుకున్న కేక్ మిశ్రమాన్ని ఆ మౌల్డ్‌లో పోసి.. గ్యాప్స్ లేకుండా కేక్ టిన్ను మెల్లగా నేలపై టాప్ చేయాలి.
- ఆ తర్వాత బేకింగ్ కోసం ముందుగా ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్లో 180 డిగ్రీల సెల్సియస్ వద్ద 30 నిమిషాల పాటు కేక్‌ను బేక్ చేయాలి.
- ఓవెన్ లేని వారు ముందుగా ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో పెట్టి 30 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టి కుక్ చేసుకోవాలి.
- కేక్ టిన్ చల్లారిన తర్వాత డీమౌల్డ్ చేసుకోవాలి. అంతే కేక్ రెడీ!
మీ పిల్లలకు కేక్స్ అంటే ఇష్టమా? - అయితే నోరూరించే ఎగ్‌లెస్ రవ్వ కేక్ ఇంట్లోనే తయారు చేసేయండిలా!
2. ఆల్మండ్ ఫ్లోర్ ఆరెంజ్ కేక్
కావలసినవి:
- బాదం పొడి-2కప్పులు
- గుడ్లు-3
- తేనె-1/4 కప్పు
- 1 నారింజపండు తురుము(పొట్టును తురుముకోవాలి)
- తాజా నారింజ రసం-1/4 కప్పు
- బేకింగ్ పౌడర్-1 టీస్పూన్
తయారీ విధానం:
- పైన చెప్పిన విధంగా ఓవెన్ లేదా గిన్నె రెడీ చేసుకోవాలి.
- ఇప్పుడు ఓ బౌల్ తీసుకుని.. అందులో గుడ్లు వేసుకుని బాగా బీట్ చేయాలి. తర్వాత బాదంపొడి, తేనె, బేకింగ్ పౌడర్, నారింజపండు తురుము, నారింజ రసం వేసి కట్ అండ్ ఫోల్డ్ విధానంలో కలుపుకోవాలి.
- ఇప్పుడు మీరు కేక్ మౌల్డ్ తీసుకుని దానికి కొంచెం నూనె రాసి కొద్దిగా మైదాపిండి చల్లుకోవాలి.
- తర్వాత మీరు రెడీ చేసుకున్న కేక్ మిశ్రమాన్ని ఆ మౌల్డ్‌లో పోసి.. గ్యాప్స్ లేకుండా కేక్ టిన్ను మెల్లగా నేలపై టాప్ చేయాలి.
- ఆ తర్వాత బేకింగ్ కోసం ముందుగా ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్లో 180 డిగ్రీల సెల్సియస్ వద్ద 30 నిమిషాల పాటు కేక్‌ను బేక్ చేయాలి. ఓవెన్ లేని వారు ముందుగా ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలో పెట్టి 30 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టి కుక్ చేసుకోవాలి.
- కేక్ టిన్ చల్లారిన తర్వాత డీమౌల్డ్ చేసుకోవాలి. అంతే కేక్ రెడీ!
రెస్టారెంట్ స్టైల్లో చికెన్ 65 - ఇలా చేశారంటే వావ్ అనాల్సిందే!