తెలంగాణ

telangana

ETV Bharat / priya

'ఉసిరి మురబ్బా' ఇలా చేసుకుంటే నోరూరునబ్బా!

అల్లం మురబ్బా రుచి చూసుంటారు కానీ.. ఉసిరి మురబ్బా ఎప్పుడైనా టేస్ట్ చేశారా? విటమిన్లు నిండిన ఆమ్లా మురబ్బా మన పూర్వీకులు చేసుకున్న వంటకమే. ఏవేవో స్వీట్లు తిని అనారోగ్యం కొనితెచ్చుకోవడం కంటే.. పసందైన ఉసిరి స్వీట్ ఇంట్లోనే చేసుకుని ఆరగించండి.

amla-murabba-sweet-with-amla
'ఉసిరి మురబ్బా' ఇలా చేసుకుంటే నోరూరునబ్బా!

By

Published : Jul 29, 2020, 1:01 PM IST

ఆరోగ్యం నిండిన ఆమ్లా మురబ్బా ఇంట్లో ఎంతో సులభంగా చేసుకోవచ్చు...

'ఉసిరి మురబ్బా' ఇలా చేసుకుంటే నోరూరునబ్బా!

కావలసినవి ఇవే..

  • ఉసిరికాయలు - 1 కిలో
  • చక్కెర లేదా బెల్లం- ఒకటిన్నర కిలో
  • యాలకుల పొడి -1 టేబుల్ స్పూన్
  • పటిక -2 టేబుల్ స్పూన్లు
  • నీళ్లు - 6 కప్పులు

తయారీ

ముందుగా ఓ గిన్నెలో నీళ్లు తీసుకుని, అందులో పటికను కలిపి పెట్టుకోవాలి. ఉసిరికాయలపై ఫోర్క్ లేదా సూదితో చిన్న చిన్న గాట్లు పెట్టుకుని పటిక కలిపిన నీళ్లలో రాత్రంతా ఉంచాలి. అలా నానబెట్టిన ఉసిరికాయలను మంచి నీళ్లతో 2-3 సార్లు బాగా కడగాలి. ఇప్పుడు ఉసిరి కాయల్ని ఓ పది నిమిషాల పాటు సన్నని మంటపై ఉడకనివ్వాలి. ఆపై ఉసిరి చక్కెర మిశ్రమాన్ని సన్నని మంటపై చిక్కటి పాకం వచ్చేవరకూ ఉడకనివ్వాలి. దీనికి యాలకుల పొడిని కలపాలి. ఆపై చల్లారనిచ్చి ఓ బౌల్ లో తీసుకోవాలి. అంతే! టేస్టీ ఆమ్లా మురబ్బా రెడీ.

ఇదీ చదవండి: కాలమేదైనా.. 'పుదీనా' రుచి చూడాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details