నోట్ల రద్దు, పాక్ పర్యటన, మెరుపు దాడి... ఇలా అనూహ్య చర్యలతో యావద్దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తే సామర్థ్యం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సొంతం. జులై 3న లేహ్ ఆకస్మిక పర్యటన ఇలాంటిదే. భారత్- చైనా మధ్య సరిహద్దులో ప్రతిష్టంభన కొనసాగుతున్న సమయంలో మోదీ లద్దాఖ్‌లో పర్యటించారు. కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటే ఈ పర్యటన చాలా ప్రత్యేకమైనది. ఘర్షణ జరిగిన ప్రాంతంలో ప్రధాని పర్యటించడం... సంక్షోభ తీవ్రతను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి-డ్రాగన్ తోకకు కత్తెర.. చైనా సంస్థల టెండర్లు రద్దు!
కొద్ది రోజులుగా కొనసాగుతున్న సైనిక చర్చలు ఫలిస్తాయన్న ఆశతో ప్రభుత్వం ఇప్పటివరు ఈ విషయాన్ని తక్కువ చేసి చూపించిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ, జూన్ 15న గల్వాన్ లోయలో జరిగిన రక్తపాతంలో ఈ ఆశలన్నీ కొట్టుకుపోయాయి.
పదేపదే అదే మాట!
ప్రస్తుతం చైనా వైఖరి గతంలో మాదిరిగా లేదని ఇప్పుడు పూర్తిగా అర్థమైంది. ఇదివరకు తలెత్తిన ప్రతిష్టంభనలను ఇరుపక్షాలు చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకున్నాయి. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలు తగ్గించి శాంతిస్థాపన చేయాలని గత రెండు నెలల నుంచి చైనా విదేశాంగ శాఖ అరిగిపోయిన పాత క్యాసెట్ వేస్తూనే ఉంది. దీంతోపాటు సరిహద్దులోని భారత భూభాగంలో తమ స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంలో నిమగ్నమైంది. గల్వాన్‌పై ప్రాదేశిక హక్కులు మావే అంటూ ఆరోపించడానికి వెనకాడటం లేదు.
చైనా ప్రతిచర్య
చర్చల్లో ఎలాంటి పురోగతి లభించకపోవడం ఆమోదయోగ్యం కాదని భారత్ ఇచ్చిన విస్పష్ట సందేశానికి తాజా పర్యటన ఓ సూచన లాంటిది. ఈ పర్యటన చైనాను కదిలిస్తుందని ప్రధానికి ముందుగానే తెలుసు. అనుకున్నట్లుగానే చైనా స్పందించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పక్షం కూడా ఉద్రిక్తతలను పెంచే చర్యలకు దిగకూడదని చైనా విదేశాంగ ప్రతినిధి హితవుపలికారు.
ఉద్రిక్తతలు మంచికే!
వాస్తవాధీన రేఖ వద్ద సమానస్థాయి సాధించడానికి నిర్దిష్ట స్థాయిలో ఉద్రిక్తత రేకెత్తించడం అవసరమేనని తాజా పర్యటన చెబుతోంది. మరోవైపు ప్రధాని మోదీ చేసిన ప్రసంగం చైనాకు ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేసినట్లుగా ఉంది. చైనా విస్తరణవాదాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ... 'విస్తరణవాద శక్తులన్నీ ఓడిపోవడమో, తోకముడవడమో జరిగింది. దీనికి చరిత్రే సాక్ష్యం' అని పేర్కొన్నారు. బలహీనులు ఎప్పటికీ శాంతిని ప్రారంభించలేరని చురకలంటించారు. దీన్ని బట్టి బలహీనమైన స్థాయిలో భారత్ చర్చలు జరపడం లేదని మోదీ సందేశమిచ్చారు.
ఇదీ చదవండి-వ్యూహం మార్చనున్న చైనా.. అరుణాచల్ ప్రదేశ్‌పై గురి!
దేశంలోని ప్రజల మనోభావాల్నీ మోదీ అర్థం చేసుకున్నారు. చైనా సైనికులు భారత భూభాగంలో లేరని ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చిన తర్వాత... తమ భూభాగాన్ని ఆక్రమించాలనే చైనా ప్రయత్నాలకు భారత్ గట్టిగా బదులిస్తుందని పౌరులకు భరోసా ఇచ్చారు. మౌలిక సదుపాయాలు, విద్యుత్, ఐటీ రంగాల్లోని పరిశ్రమల్లో చైనా కంపెనీల భాగస్వామ్యంపై సమీక్షించాలని నిర్ణయం తీసుకున్నారు.
కఠిన వాస్తవమిదే