తెలంగాణ

telangana

ETV Bharat / opinion

కరోనా‌ వ్యాప్తికి డిజిటల్‌ కళ్లెం - today business news

నగదు ఆధారంగా నడిచే భారత ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ నోటు తన సాధారణ ఆయుఃకాలం(రెండు, మూడేళ్లు)లో అనేక చేతులు మారుతుంది. భారత్‌లో రూ.5, రూ.10 నోట్లకు సుమారు రెండేళ్లదాకా, రూ.100 నోటుకు సుమారు మూడు, నాలుగేళ్లదాకా, రూ.500 నోట్లకు 5-7 సంవత్సరాల వరకు జీవన కాలం ఉంటుంది. కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత సమయంలో అంటువ్యాధుల సంక్రమణ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. కరెన్సీ ద్వారా కరోనా సంక్రమిస్తుందా అనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదని నిపుణులు చెబుతున్నారు.

corona contained bye digital payments
కొవిడ్‌ వ్యాప్తికి డిజిటల్‌ కళ్ళెం

By

Published : May 9, 2020, 9:04 AM IST

న దేశంలో చాలామందికి పుస్తకాలు, కాగితాల్ని తిరగేసేటప్పుడు, కరెన్సీ నోట్లను లెక్కించేటప్పుడు తడి కోసం చేతివేళ్లను నాలుకపై తాకించే అలవాటు ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇలాంటి అలవాటువల్ల వివిధ రకాల అంటువ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న రోజుల్లో ముప్పు కొన్ని రెట్లు పెరిగింది. నగదు ఆధారంగా నడిచే భారత ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ నోటు తన సాధారణ ఆయుఃకాలం(రెండు, మూడేళ్లు)లో అనేక చేతులు మారుతుంది. భారత్‌లో రూ.5, రూ.10 నోట్లకు సుమారు రెండేళ్లదాకా, రూ.100 నోటుకు సుమారు మూడునాలుగేళ్లదాకా, రూ.500 నోట్లకు 5-7 సంవత్సరాల వరకు జీవన కాలం ఉంటుంది. కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత సమయంలో అంటువ్యాధుల సంక్రమణ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. కరెన్సీ ద్వారా వ్యాధి సంక్రమిస్తుందా అనే విషయంపై ఇప్పటికీ స్పష్టత తక్కువే. అలాగని పూర్తిగా నిర్లక్ష్యం చేసే అవకాశమూ లేదు. కరెన్సీ నోటును తాకిన ప్రతిసారీ చేతులను శుభ్రంగా కడుక్కోవడం సాధ్యంకాని పని. నోట్లను లెక్కించేటప్పుడు చేతివేళ్లను నాలుకతో తడి చేసుకోకుండా, ముఖం, కళ్లు వంటి వాటిని తాకకుండా ఉండటం కూడా సంపూర్తిగా సాధ్యంకాని పని. అలాంటప్పుడు ఎంతోకొంత ముప్పు తప్పదనే భావించాల్సి ఉంటుంది.

సాంకేతికతకు పట్టం కట్టాలి

ఒకవేళ తప్పనిసరిగా కరెన్సీ నోట్లనే వాడాల్సి వచ్చినా, వేగంగా సంక్రమించే అంటువ్యాధులను నిరోధించడానికి, తగ్గించడానికి అవసరమైన మార్గాల్ని అనుసరిస్తూ, ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాంకు శాఖలకు, ఏటీఏమ్‌లకు వచ్చే వ్యక్తులు కచ్చితంగా భౌతిక దూరాన్ని ఉల్లంఘిస్తూ సంక్రమణ ముప్పును పెంచే అవకాశాలే ఎక్కువ. మన దేశంలో ఏప్రిల్‌ 2019 నాటికి 1,19,608 షెడ్యూల్‌, వాణిజ్య బ్యాంకు శాఖలు ఉన్నాయి. ప్రతి లక్ష జనాభాకు 13.54 బ్యాంకు శాఖలున్నాయి. ఏటీఏమ్‌ల సంఖ్య 2.33 లక్షలు. దేశంలోని ఆరు లక్షలకుపైగా గ్రామాల్లో 30 వేలదాకా ఏటీఎమ్‌లు ఉన్నాయి. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వాటిని ఎన్నిసార్లు క్రిమిసంహారక ద్రవాలతో శుభ్రపరచగలరు? జనసమ్మర్దం అధికంగా ఉండే చోట అదుపు చేయడం మరింత కష్టం. అందుకని, వినియోగదారులకు ఎక్కువచోట్ల నగదు పొందగలిగే అవకాశాల్ని కల్పించడం మంచిది. అలాంటి మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఉన్నాయి. మన దేశంలో ప్రస్తుతం డెబిట్‌ కార్డుల సంఖ్య దాదాపు 82కోట్లు. కార్డు స్వైపింగ్‌ ఉపకరణాలు 49.47 లక్షలు, మైక్రో ఏటీఎమ్‌లు 2.56 లక్షలు (వీటిలో ఆధార్‌తో చెల్లింపుల విధానం అనుసంధానం జరిగింది). ఫోన్‌ ద్వారా పనిచేసే, దేశంలో మెరుగైన విస్తృతిని కలిగి ఉన్న ఇలాంటి పరికరాల సహాయంతో నగదు పొందడానికి ‘క్యాష్‌ ఎట్‌ పీఓఎస్‌’ సౌకర్యాన్ని రిజర్వు బ్యాంకు దాదాపు దశాబ్దం క్రితమే అనుమతించింది. ఇంకా మిగిలిన మారుమూల గ్రామాల్లోనూ, ఏటీఎమ్‌తో పోల్చితే చాలా తక్కువ ఖర్చుతో వీటిని త్వరగా ఏర్పాటు చేయవచ్ఛు ఈ ఉపకరణం ఉండే ప్రతి దుకాణదారుడు నియమాలకు లోబడి నగదు పంపిణీ చేపట్టవచ్ఛు ఇందులో ఖాతాదారుల రోజువారీ గరిష్ఠ మొత్తాన్ని అయిదు వేల రూపాయలకు పెంచడం, ఖాతాదారుల నుంచి ఎలాంటి రుసుమూ వసూలు చేయకుండా నగదు పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవడం అవసరం. ఇలాంటి లావాదేవీలకు కార్డు కంపెనీల ఇంటర్‌ఛేంజ్‌ రుసుమునూ తొలగించాలి. అవసరమైతే దుకాణదారులకు నగదు సేవల సంస్థలు జారీ చేయదగిన నోట్లను తగిన సమయానికి సరఫరా చేసేలా బ్యాంకులు వారిని నిర్దేశించాలి. కొవిడ్‌ విజృంభణ వేళ ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మౌలిక సదుపాయాలను ఉపయోగించడం ద్వారా అంటువ్యాధులను కొన్ని ప్రాంతాలకే కట్టడి చేసి, నియంత్రించడం సాధ్యమవుతుంది.

వైరస్‌ నుంచి రక్షణ

గదు ఆధారిత భారత ఆర్థిక వ్యవస్థలో కరెన్సీ నోట్ల వాడకాన్ని పూర్తిగా నివారించడం అసాధ్యం. ఇలాంటి సమస్యను నివారించేందుకు డిజిటల్‌ చెల్లింపులను ఆశ్రయించడమే మేలైన మార్గం. డిజిటల్‌ చెల్లింపులతో ఇలాంటి ప్రమాదం లేదని చెప్పలేం కానీ, చాలా తక్కువేనని చెప్పాలి. భారత్‌లో కొన్నేళ్ల క్రితం పెద్ద నోట్ల రద్దు తరవాత చాలామంది నగదు చెల్లింపుల నుంచి డిజిటల్‌ చెల్లింపులకు మారారు. వారిలో కొంతమంది కొన్ని నెలల్లోనే మళ్లీ వారి పాత అలవాట్లనే ఆశ్రయించారు. డిజిటల్‌ చెల్లింపుల్లో ఉండే సౌలభ్యాన్ని ఆకళింపు చేసుకున్నవారు మాత్రం దాన్నే కొనసాగిస్తున్నారు. ఈ-కామర్స్‌లో నానాటికీ పెరుగుతున్న కొనుగోళ్ల సంఖ్యే ఆన్‌లైన్‌ చెల్లింపుల వృద్ధికి నిదర్శనం. ఇటీవలి కాలంలో బ్యాంకులు, ఇతర సంస్థల ద్వారా ‘పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌)’ లేదా కార్డు స్వైపింగ్‌ యంత్రాల విస్తరణ పెద్దయెత్తున జరిగింది. ఏటీఎమ్‌లు, మైక్రోఏటీఎమ్‌ల ఏర్పాటు కూడా బాగా విస్తరించింది. ఖాతాదారులు బ్యాంకు శాఖలకు ప్రత్యక్షంగా వెళ్లడం, మార్కెట్లు, దుకాణాల్లో అమ్మకందారులు, కొనుగోలుదారుల మధ్య నగదు మార్పిడి జరిగే సందర్భాల్లో వ్యక్తులు చాలా దగ్గరదగ్గరగా ఉంటారు. ఇది భౌతిక దూరం నిబంధనకూ విరుద్ధమే. కొద్దిపాటి శిక్షణతో కార్డు ద్వారా డిజిటల్‌ చెల్లింపుల్ని సురక్షితంగా చేపడుతూ ఇలాంటి పరిస్థితిని పరిహరించవచ్ఛు ఈ పద్ధతిలో సమర్థంగా భౌతిక దూరాన్ని అమలు చేస్తూ లావాదేవీలు చేపట్టవచ్ఛు చిన్నపరిమాణంలో ఉండే చెల్లింపు పరికరాన్ని అతి తక్కువ శ్రమతో శుభ్రంగా ఉంచడం కూడా చాలా సులభం. ఈ-కామర్స్‌ ఆల్‌లైన్‌ లావాదేవీల్లో ఏ సందర్భంలోనూ కరెన్సీని ఉపయోగించాల్సిన అవసరం తలెత్తదు. అందువల్ల వ్యాధి సంక్రమణను చాలావరకు నివారించవచ్ఛు కరెన్సీ నోటు జీవనకాలం పొడిగింపు, తద్వారా ప్రభుత్వానికి, దేశానికి పునర్ముద్రణ వ్యయాలు తగ్గుతాయి.

ABOUT THE AUTHOR

...view details