ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గుజరాత్‌లో భాజపా దూకుడు ప్రచారాన్ని చూస్తే- రాష్ట్రంలో వరసగా ఏడోసారీ విజయం సాధించాలనే తహతహతో కృషి చేస్తున్నట్లు కనిపిస్తోంది. మంత్రులు, శాసనసభ్యులు, ప్రభుత్వంపై నెలకొన్న వ్యతిరేకతతోపాటు, బరిలో కొంతమంది తిరుగుబాటు అభ్యర్థులు పోటీకి దిగడంవంటి అంశాలు తీవ్ర నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని ఆ పార్టీ ఆందోళన చెందుతోంది. క్షేత్రస్థాయి అంచనాల ప్రకారమైతే, గుజరాత్‌లో తిరిగి అధికారంలోకి రావడంపై మోదీ అంతగా ఆందోళన చెందడం లేదని, ఈసారి సీట్ల విషయంలో సరికొత్త రికార్డును సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెబుతున్నారు.
1985 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో మాధవసింహ్ సోలంకీ నేతృత్వంలో 149 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ తరహాలో విజయదుందుభి మోగించాలనేది ప్రధాని లక్ష్యంగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఈసారి 150 సీట్లు సాధించాలని భాజపా శ్రేణులకు మోదీ లక్ష్యంగా నిర్దేశించినట్లు చెబుతున్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు భారీస్థాయిలో ఉచితాలు, తాయిలాలతో ఊరిస్తూ, రాజకీయ స్థితిగతులనే మార్చేయాలని చూస్తున్నారు. ఇలా ఎన్ని వ్యతిరేక ప్రయత్నాలు జరిగినా, గుజరాత్‌లో తన ఆధిపత్యానికి ఎలాంటి ముప్పు లేదని భాజపా తన వ్యతిరేకులందరికీ స్పష్టం చేయాలన్నదే ప్రధాని మోదీ వ్యూహంగా చెబుతున్నారు.
ఓటర్లకు వినతి:
మోదీ నవంబరు ఆరో తేదీన ఎన్నికల సభలో- "ఈ గుజరాత్‌ను నేనే తీర్చిదిద్దాను" అంటూ కొత్త నినాదాన్ని ప్రారంభించారు. విద్వేషాల్ని వ్యాపింపజేసే శక్తులు, గుజరాత్‌ను అప్రతిష్ఠపాలు చేసే శక్తులు రాష్ట్రం నుంచి తుడిచి పెట్టుకుపోతాయంటూ విపక్షాలపై తీవ్రస్థాయి విమర్శల దాడి చేస్తున్నారు. "భాజపా అభ్యర్థి ఎవరు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కమలం పువ్వును మాత్రం మదిలో నిలుపుకోండి. మీరు ఓటు వేస్తున్నప్పుడు కమలం పువ్వు కనిపిస్తే, అది భాజపా అనీ, మీ దగ్గరికి వచ్చిన మోదీ అని అర్థం చేసుకోండి. కమలం గుర్తుకు వేసిన ప్రతి ఓటూ మీరిచ్చే ఆశీర్వాదంలా నేరుగా మోదీ ఖాతాలోనే పడుతుంది" అంటూ ప్రధాని ఓటర్లకు విన్నవించారు. పోలింగ్‌కు ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావాలంటూ మోదీ ప్రతి ఎన్నికల సభలోనూ నొక్కిబద్దలు కొట్టాలి. భాజపాకు ఓటు వేసేందుకే ఇలా చెప్పడం లేదు. ప్రతి పౌరుడూ ప్రజాస్వామ్య చెబుతున్నారు.
"ఈసారి ఎన్నికల్లో పోలింగ్‌కు భారీయెత్తున తరలిరావాలి. గత రికార్డులన్నింటినీ పండుగలో పాలు పంచుకోవాలన్నదే ఉద్దేశం. ప్రతి ఒక్కరికీ ఇది నా విన్నపం" అంటూ మోదీ పేర్కొనడం గమనార్హం. "ఇక్కడ ప్రతి బూత్‌లోనూ భాజపా గెలవాలి. ఈసారి అన్ని పోలింగ్ బూత్‌లనూ గెలవడంపైనే దృష్టి పెట్టాను. దీన్ని సాధించడంలో మీరు నాకు తోడ్పాటు అందిస్తే, భాజపా అభ్యర్థులు సులువుగా అసెంబ్లీకి చేరుకుంటారు" అంటూ ఓటర్లకు వివరిస్తున్నారు. "గుజరాత్ సీఎం భూపేంద్ర- గతంలోని నరేంద్ర రికార్డులను బద్దలు కొట్టాలని కోరుకుంటున్నా. గుజరాత్‌ను, దేశాన్ని అభివృద్ధి పథంలో మున్ముందుకు తీసుకెళ్లేందుకు మనమందరం కష్టపడాల్సిన అవసరం ఉంది" అంటున్నారు. మోదీ వ్యక్తిగతంగా ఓటర్లకు చేస్తున్న వినతులు భాజపా లోపాల్ని అధిగమించడానికి తోడ్పడతాయని భావిస్తున్నారు.