ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా, మాస్కులు సరిగా ధరిస్తే కరోనాను సులువుగా కట్టడి చేయచ్ఛు కానీ ఈ రెంటిని పక్కకు పెట్టడం వల్లే ఇప్పుడీ ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విపత్కర స్థితి నుంచి బయటపడాలని ప్రభుత్వం పదిరోజుల లాక్‌డౌన్ విధించింది. ఈ లాక్‌డౌన్ రోజుల్లో ఇల్లే ఒకస్వర్గ సీమలా భావించండి. ఇంటిల్లిపాదితో గడపడానికి ఇదో అవకాశంగా భావించండి.. మధురమైన అనుభూతిని పొందండి.. కాలు మాత్రం బయటపెట్టకండి. కరోనా పోరాటంలో మనవంతుగా కృషి చేద్దాం.. మహమ్మారిని తరిమికొడదాం..
నాడు.. కాకతీయుల పురిటిగడ్డ ఓరుగల్లు. తమ సామ్రాజ్యంపై దండెత్తడానికి వచ్చిన శత్రువులను ఎదిరించారు.. ఖడ్గాలను చేతపట్టి పోరాడారు. తరిమితరిమికొట్టారు. మంచి పాలన అందించారు.. చరిత్రలో నిలిచిపోయారు..
నేడు.. అదే గడ్డపై కరోనాసురుడు విలయతాండవం చేస్తున్నాడు. ప్రజలపై పగపట్టాడు. కంటికి కనిపించకుండా దాడి చేస్తున్నాడు.. భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు.. ప్రాణాలూ తీస్తున్నాడు.. మహమ్మారిని అంతం చేయడానికి కత్తులు పట్టాల్సిన అవసరం లేదు. కొవిడ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలి. ఇందుకు ఒకటే మార్గం.. వైరస్‌కు చిక్కకుండా ఇంట్లో ఉండాలి. కరోనా రహిత సమాజంగా మార్చాలి.
కళను బయటకు తీయండి..
చిన్ననాడు కొన్ని కళల్లో ప్రవేశం ఉంటుంది. కానీ ప్రావీణ్యం సంపాదించలేదనే ఓ చిన్న నిరాశ మిగిలి ఉండే ఉంటుంది. మీలోని కళాకారుడిని మేల్కొల్పండి. కుంచెతో చిత్రాలు వేయండి, గాత్రంతో పాటలు ఆలపించండి. డైలాగులతో మీలోని నటసార్వభౌముణ్ని మీ కుటుంబ సభ్యులకు పరిచయం చేయండి.
థియేటర్‌గా భావించండి..
ఇన్నాళ్లు పనిలో బిజీబిజీగా ఉండే ఉంటారు. సినిమాలు చూడటానికి కూడా అవకాశం ఉండదు. ఇప్పుడు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రస్తుత రోజుల్లో 24/7 సినిమాలు వచ్చే ఛానళ్లు ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కొత్తవి వస్తున్నాయి. ఎందుకాలస్యం.. మీ ఇంటినే థియేటర్‌లా భావించండి. కుటుంబ సభ్యులందరూ కలిసి సినిమాలు చూస్తూ ఆనందించండి.
పలకరించండి..
నిత్యం పని ఒత్తిళ్లతో స్నేహితులు, బంధువులతో పలకరింపులు కూడా తగ్గుతున్నాయి. ఇప్పుడా ఆ లోటును పూడ్చండి. మీ బాల్య స్నేహితులకు ఫోన్లు చేయండి.. వారితో మాట్లాడుతూ.. నాటి మధురానుభూతులను నెమరువేసుకోండి. బంధువుల యోగక్షేమాలను తెలుసుకోండి. ఈ కష్టకాలంలో ఓ పలకరింపు సైతం ఎంతో ఓదార్పునిస్తుంది.
గృహమే ఓ రెస్టారెంట్..