ఉన్న ఇంటినే కాస్త పెద్దదిగా చేయండిలా! - interior design
రాగిణి వాళ్లది చక్కటి ఇండిపెండెంట్ హౌస్. అయితే బయట నుంచి చూస్తే పెద్దగా అనిపించినా లోపల గదులన్నీ చిన్నచిన్నగా ఉంటాయి. మరి ఇలా ఉన్న చిన్న ఇంటినే అందంగా, ఆకర్షణీయంగా పెట్టుకోవడంతోపాటు పెద్దదిలా కనిపించేలా చేయడమెలానో చూద్దామా...
ఉన్న ఇంటినే కాస్త పెద్దదిగా చేయండిలా!
By
Published : Apr 9, 2021, 2:09 PM IST
ఇల్లు పెద్దదిగా, విశాలంగా కనిపించాలంటే గోడలకు లేత రంగులుండాలి. నీలం, క్రీమ్, నారింజ, పసుపు రంగులు బాగుంటాయి.
కాంతివంతమైన దీపాలు... కాంతి తక్కువగా ఉంటే ఇల్లు ఉన్న పరిమాణం కంటే చిన్నగా, నిర్జీవంగా కనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే.. బాగా వెలుతురునిచ్చే కాంతివంతమైన విద్యుత్ దీపాలను ప్రతి గదిలోనూ అమర్చాలి.
తక్కువ ఫర్నిచర్...ఎక్కువ ఫర్నిచర్ ఉంటే గదులు చిన్నగా కనిపిస్తాయి. కాబట్టి వీలైనంత తక్కువగా ఉండేలా చూసుకోవాలి. అలాగే అ సామానంతా లేత రంగుల్లో, గోడలకు మ్యాచ్ చేసుకోండి. అప్పుడు చిన్నగా ఉన్నట్లు అనిపించదు.
అద్దాలు.. ఇంటిని పెద్దదిగా, విశాలంగా చూపడంలో అద్దం ముందు ఉంటుంది. సూర్యకాంతి పడే ప్రదేశాల్లో వీటిని అమరిస్తే గదులన్నీ ప్రకాశవంతంగా మారడంతోపాటు పెద్దగానూ అనిపిస్తాయి. ప్రధాన ద్వారానికి ఎదురుగా హాలులో ఓ పెద్ద అద్దాన్ని ఏర్పాటు చేస్తే ఇంటికి కొత్త అందం వస్తుంది.
పరిశుభ్రంగా...ఇల్లంతా దుస్తులు, బొమ్మలు, ఆటవస్తువులతో చిందరవందరగా ఉన్నా... చిన్నగానూ అనిపిస్తుంది. ఎక్కడి వస్తువులను అక్కడ చక్కగా సర్దేస్తే బాగుంటుంది.