- ఐటీ కంపెనీలో పని చేసే నీరజ.. తన ఉద్యోగాన్ని వదులుకుని హోం ట్యూషన్లను మొదలుపెట్టింది. కరోనా వల్ల డిజిటల్ తరగతులు మొదలుపెట్టడంతో హోం ట్యూషన్లకు డిమాండ్ పెరిగింది. గతంలో తాను సంపాదించిన దానికంటే రెట్టింపు సంపాదిస్తోంది.
- అల్వాల్‌కు చెందిన గణిత ఉపాధ్యాయులు వెంకటేశ్ కరోనా కారణంగా ఉద్యోగాన్ని కోల్పోయారు. అనంతరం కొన్ని నెలలు ప్రత్యామ్నాయ ఉపాధి వెతుక్కుని.. ప్రస్తుతం హోం ట్యూషన్లు చెబుతున్నారు. వారంలో ముగ్గురికి ట్యూషన్ చెబుతూ గతంలో కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు.
డిజిటల్ తరగతులపై మిశ్రమ స్పందన..
కరోనా కారణంగా డిజిటల్ తరగతులకు సంబంధించి తల్లిదండ్రుల్లో మిశ్రమ స్పందన ఉంటోంది. కరోనా భయం వల్ల పాఠశాలలు తెరవకుండా ఉంటేనే మంచిదని కొందరు భావిస్తుంటే.. చాలా మంది తల్లిదండ్రులు ఆన్‌లైన్ తరగతులతో పిల్లలకు సరైన విద్య అందడం లేదని అనుకుంటున్నారు. తెలుగుతో పాటు అన్ని సబ్జెక్టులకు ఐదో తరగతి విద్యార్థులకు ట్యూటర్లను నియమించుకుంటున్నారు. మరో వైపు 60 నిముషాల ఆన్‌లైన్ తరగతిలో 45 నిముషాలు ఓ అంశంపై బోధన, మరో 15 నిముషాలు సందేహాల నివృత్తికి వినియోగిస్తున్నారు.
Study Tips: ఎంత చదివినా.. గుర్తుండటం లేదా?
ఈ తరుణంలో విద్యార్థులందరికి అవకాశం రావడం లేదని గుర్తించిన తల్లిదండ్రులు హోం ట్యూటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. కొందరు తల్లిదండ్రులు కేవలం సందేహాల నివృత్తికి మాత్రమే ట్యూషన్ చెప్పాలని అడుగుతున్నారు.
- పార్ట్‌టైం ట్యూషన్లు చెప్పేవాళ్లు వారం రోజుల్లో మూడు తరగతుల చొప్పున నెలకు రూ.5 వేల నుంచి రూ.8వేల వరకు సంపాదిస్తున్నారు.
గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు..
చదువుకునే విద్యార్థులే పార్ట్ టైమ్‌గా ట్యూషన్లు చెబుతున్నారు. ప్రాంతం, పిల్లల అవసరం, దూరం ఆధారంగా ఫీజు మారుతుంది. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు గంటకు రూ.700, పిల్లలకు అర్థమయ్యేలా చెప్పగలిగే వారు రూ.2వేల వరకు వసూలు చేస్తున్నారు.