మీ జీవితంలో మీకు ఒక ప్రేమ వ్యవహారం ఉందని తెలిస్తే తల్లిదండ్రులు తట్టుకోలేరన్న బాధ, అవగాహన ఉన్నవారు.. మీరు చనిపోతే వాళ్లు ఎలా తట్టుకోగలరని అనుకుంటున్నారో తర్కంగా ఆలోచించి చూడండి. మీరు ఒక్కరే బిడ్డ.. వాళ్లు కష్టపడి మిమ్మల్ని చదివించారు. అతను మంచివాడు అనుకొని అతనిని నమ్మి మీరు కొంతకాలం ప్రేమించారు. ఎప్పుడైతే మీ ఆలోచనలకు అతను అనుగుణంగా లేడని, అతని ప్రవర్తన గురించి వేరే విధమైన అవగాహన వచ్చిందో మీరు వద్దనుకుంటున్నారు. అలాగే ఈ విషయం ఇంట్లో తెలిస్తే తల్లిదండ్రులు తట్టుకోలేరని అంటున్నారు. అయితే ఇంట్లో తెలిసినంత మాత్రాన మొట్టమొదట వారు బాధపడ్డా, ఎప్పటికీ మిమ్మల్ని రక్షించేది, మిమ్మల్ని అక్కున చేర్చుకొని తోడుగా నిలబడేది మీ తల్లిదండ్రులే అనే విషయాన్ని అర్ధం చేసుకోండి.
ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు.. ఏం చేయను?
మేడమ్.. నేను ఇంజినీరింగ్ పూర్తి చేశాను. జాబ్ కోసం ట్రై చేస్తున్నా... నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. నా స్నేహితులు వద్దన్నా వినకుండా అతన్ని నమ్మాను. అతనితో ట్రావెల్ చేసిన తర్వాత నాకు అతను మంచివాడు కాదని తెలిసింది. దాంతో నేను అతనిని వదిలేద్దాం అనుకున్నా.. కానీ అతను మా ఇంట్లో చెప్తాను అని బెదిరిస్తున్నాడు. ఈ విషయం మా ఇంట్లో తెలిస్తే నన్ను బతకనివ్వరు. మా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే సంతానం. నన్ను కష్టపడి చదివించారు. ఈ విషయం తెలిస్తే తట్టుకోలేరు. చనిపోదామని కూడా ప్రయత్నించా. ఈ విషయాలన్నీ అతనికి తెలుసు. మా ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి. సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి
ఆ విషయం మా ఇంట్లో చెప్తానని బెదిరిస్తున్నాడు.. ఏం చేయను?