తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

పిల్లలు అదుపులో ఉండాలని భయపెడుతున్నారా? - tips to control kids

చిన్నవయసులో మనసులో పడిన ముద్రలు కొందరిలో పెద్దైనా పోవు. కొందరు పిల్లలు పెరిగిన వాతావరణాన్ని బట్టి భయస్థులుగా మారితే, మరికొందరు స్వతహాగానే ప్రతిదానికీ భయపడుతుంటారు. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే జీవితంలో ముందుకు వెళ్లలేరు. అందుకే అలాంటి పిల్లల్ని గుర్తించి వారికి భరోసా ఇవ్వాలి.

tips to control kids
పిల్లలకు తల్లిదండ్రుల భరోసా

By

Published : Sep 25, 2020, 10:48 AM IST

‘అన్నం తినకపోతే బూచోడు వచ్చి ఎత్తుకుపోతాడు’. ‘నువ్వు చెప్పిన మాట వినకపోతే ఇంజెక్షన్‌ చేయిస్తా’. ‘అల్లరి చేశావంటే మీ టీచర్‌తో చెబుతా’ ఇలా రకరకాలుగా చెప్పి పిల్లల్ని అదుపు చేయాలనుకుంటాం. నిజానికి ఇలా చెప్పడం వల్ల వారు తాత్కాలికంగా మాటవింటారేమో కానీ...కాలక్రమేణా మీరు చెప్పే మాటల్ని నమ్మకపోవచ్ఛు లేదా టీచర్‌ అన్నా, డాక్టర్‌ అన్నా భయపడతారు.

వారిపై వ్యతిరేకతనూ పెంచుకుంటారు. అలాచేయొద్ధు..చెప్పిన పని చేయకపోతే తాను కోరుకున్నవి ఇవ్వకండి. దాన్ని పూర్తిచేస్తేనే ఇస్తామని కచ్చితంగా చెప్పండి. మొదట్లో కాస్త కష్టంగా భావించినా క్రమంగా అర్థం చేసుకుంటారు.

ముఖ్యంగా సున్నిత మనస్తత్వం గల పిల్లలు వారికున్న భయాల్ని బయటికి చెప్పరు. వాటిని పదే పదే తలుచుకుని తమలో తామే కుమిలిపోతుంటారు. కలత నిద్ర, పక్క తడపడం వంటివెన్నో దీని లక్షణాలు. ప్రతిదానికీ పేచీలు పెట్టడం, బడికి వెళ్లనని మారాం చేయడం వంటివెన్నో చేస్తుంటారు. తమ ఆందోళనల్ని దాచుకునే ప్రయత్నంలో మొండిగానూ ప్రవర్తిస్తుంటారు. తల్లిగా వారి ఆందోళనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దాన్నుంచి బయటపడేందుకు ఇతర వ్యాపకాల్ని అలవాటు చేయండి.

ABOUT THE AUTHOR

...view details