తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

LOVE FAILURE : ఆ ఫొటోలు అతనికి చూపించాలనుకుంటున్నా! - love breakup

ఒకమ్మాయితో మూడేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నా. మేం అన్నిరకాలుగా దగ్గరయ్యాం. కానీ మంచి సంబంధం వచ్చిందనే కారణంతో తను నన్ను దూరం పెట్టింది. త్వరలోనే పెళ్లి చేసుకొని విదేశాలకు వెళ్తోంది. ఇలా చేయడం నన్ను, పెళ్లాడబోయే వాడినీ మోసం చేస్తున్నట్టేగా. తనపై చాలా కోపంగా ఉంది. మేం సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఆ అబ్బాయికి చూపించాలనుకుంటున్నా. మరోవైపు నైతికంగా సరికాదు అనిపిస్తోంది. తనని మర్చిపోలేకపోతున్నా. ఏం చేయాలి? - ఎస్‌.శ్రీహర్ష, ఈమెయిల్‌

Cheating, cheating in love, love breakup
చీటింగ్, చీటింగ్ ఇన్ లవ్, లవ్ బ్రేకప్

By

Published : Jul 3, 2021, 2:17 PM IST

అమితంగా ఇష్టపడ్డ అమ్మాయి వేరొకరితో పెళ్లికి సిద్ధపడితే ఎవరికైనా బాధగానే ఉంటుంది. అందులో నుంచి బయటికొచ్చి.. తను మిమ్మల్ని ఎందుకు తిరస్కరిస్తోంది? మీ బలహీనతలేంటో ఒక్కసారి విశ్లేషించుకోండి. అప్పటికీ మీరు తనకి సరిజోడి అనిపిస్తే, మీది నిజమైన ప్రేమే అనిపిస్తే మీ మనోభావాలను, ఆ అమ్మాయి పట్ల మీకున్న ఫీలింగ్స్‌ అర్థమయ్యేలా వివరించండి. అయినా తను మీ ప్రేమను అంగీకరించకపోతే అది ప్రేమ కాదు ఆకర్షణే అని గ్రహించండి. మంచి స్నేహితుడిగా ఆమె భావి జీవితానికి స్వాగతం పలకండి.

ఇదీ చదవండి :లోపాన్ని దాచిపెట్టి... పరువుకోసమే పెళ్లి..

సొంత భవిష్యత్తు కోసం ఆమె మిమ్మల్ని వదిలి మరో మార్గం చూసుకుంది. అది స్వార్థమే కావొచ్చు. మిమ్మల్ని వద్దనుకొని వెళ్లిపోయిన అమ్మాయిని మళ్లీ మీ జీవితంలోకి అహ్వానించాలని ఎలా అనుకుంటున్నారు? మీకూ ఆత్మాభిమానం ఉంటుంది కదా?! పైగా వాళ్ల పెళ్లి చెడగొట్టాలనుకోవడం నైతికంగా కరెక్ట్‌ కాదని మీరే భావిస్తున్నారు. అంటే మంచి, చెడులు విశ్లేషించుకునే సామర్థ్యం మీలో ఉంది. ఇప్పటికైనా ఏది జరిగినా అది మన మంచికే అనే దృక్పథంతో ముందడుగు వేయండి.

ప్రేమ మధురమైందే.. కానీ అదే జీవితం కాదు. ఇకపై భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఆ ప్రేమ తాలూకు గుర్తులేవీ మీ దగ్గర పెట్టుకోకండి. ఆమె వస్తువులు, ఫొటోలు, ఫోన్‌ నెంబర్‌.. అన్నీ తొలగించండి. సామాజిక మాధ్యమాల్లో తనని అనుసరించడం ఆపండి. ఖాళీగా ఉంటే ఆ ఆలోచనలే వేధిస్తాయి. మీకిష్టమైన వ్యాపకం ఏదైనా ఎంచుకోండి. కొత్త నైపుణ్యాలు పాత గాయం నుంచి కోలుకునేలా చేస్తాయి. చదువు, వృత్తిలో లక్ష్యాలు ఏర్పరచుకొని ముందుకెళ్తే ఆత్మవిశ్వాసం పెరిగి ఒత్తిడి, కుంగుబాటు తగ్గుతాయి. మీలో మీరే సతమతమయ్యే బదులు సామాజిక సంబంధాలు మెరుగు పరచుకోవడానికి ప్రయత్నించండి. ఆప్త మిత్రులతో బాధ పంచుకోండి. పాత జ్ఞాపకాల్ని మర్చిపోయేలా ఏదైనా విహారయాత్రకు వెళ్లండి. ఇవి మిమ్మల్ని కుదుట పడేస్తాయి. ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలననే ధైర్యానిస్తాయి. ఆల్‌ ది బెస్ట్‌.

ఇదీ చదవండి :RELATION: ఆలుమగల అనుబంధానికి అదే మంత్రం..!

ABOUT THE AUTHOR

...view details