ఆరోగ్యం... ఇంటిని, ఆఫీసును బ్యాలెన్స్ చేయాలంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. అందుకు ఆరోగ్యకర అలవాట్లు, నిద్రకు ప్రణాళికను రూపొందించుకోవాలి. దాన్ని కచ్చితంగా పాటించాలి. లేదంటే మానసికంగా, శారీరకంగా బలహీనమై పోతారు. దాంతో ఎక్కడలేని ఒత్తిడికి గురవుతారు. ఈ స్థితిలో ఇల్లూ, ఆఫీసు.. రెంటికీ న్యాయం చేయలేరు. కాబట్టి ఆరోగ్యం జాగ్రత్త.
భాగస్వామితో... ఆఫీసు, ఇంటి పనులు, పిల్లలు... ఇలా ఎక్కువ భారం మీపై పడుతున్నట్లు అనిపిస్తే పరిస్థితులను శ్రీవారికి విడమరచి చెప్పండి. అప్పుడే మీకు వారి నుంచి కావాల్సిన సాయం అందుతుంది.
మీకంటూ కొంత... విరామం లేకుండా పనులు చేస్తూ వెళ్లొద్దు. మధ్యలో స్వల్ప విరామాలు చాలా అవసరం. ఇవి మీ ఉత్పాదకతను పెంచుతాయి. మీకు నచ్చిన వంటకాన్ని చేయడమో, ధ్యానం, అభిరుచులకు మరింత సానబెట్టడం... ఇలా ఏదో ఒక పనిచేస్తూ బిజీగా ఉండాలి. ఇవి మిమ్మల్ని సంతోషంగా, ఆనందంగా ఉండేలా చేస్తాయి.