తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

నేను తిరిగి నా జుట్టును పొందగలనా? - tips for healthy hair in telugu

పొడవాటి, ఒత్తైన జుట్టు ఉండాలని ప్రతి మగువ కోరుకుంటుంది. దానికి తగినట్లుగా జుట్టు పెరిగేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. వివిధ రకాల నూనెలు, షాంపూలు, ప్రొటీన్​లతో కూడిన ఆహారం తీసుకుంటాం. కానీ ఇన్ని తీసుకున్నా మన శరీరంలో జరిగే కొన్ని మార్పుల ద్వారానూ జట్టు సరిగా పెరగకపోవచ్చు. మరి అలాంటి సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం..

tips for healthy hair
జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే

By

Published : Apr 28, 2021, 12:52 PM IST

నమస్కారం మేడమ్‌.. నా వయసు 21 సంవత్సరాలు. నేను నాలుగేళ్ల క్రితం రక్తహీనతతో బాధపడ్డాను. ఆ సమయంలో జుట్టు రాలిపోయి పల్చగా మారింది. దానివల్ల మా ఇంట్లో వాళ్లు నాకు గుండు చేయించారు. అయినా నా జుట్టు ఆరోగ్యంగా పెరగలేదు. డాక్టరు దగ్గరికి వెళ్తే శరీరంలో రక్తం తక్కువగా ఉందని రక్తం ఎక్కించారు. ఆ తర్వాత కూడా జుట్టు ఆరోగ్యంగా పెరగలేదు. దాంతో మళ్లీ గుండు చేయించుకున్నాను. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను. రక్తహీనత సమస్య కూడా లేదు. జుట్టు పెరుగుదలకు కావాల్సిన ఆహారం తీసుకుంటున్నాను. కానీ నా జుట్టు చాలా పల్చగా ఉంది. చూడ్డానికి బట్టతలలా కనిపిస్తోంది. నేను తిరిగి నా జుట్టుని పొందగలనా? దయచేసి నాకు సలహా ఇవ్వగలరు.

- ఓ సోదరి

జ. మీ జుట్టుని ఒత్తుగా పెంచుకోవడానికి, కుదుళ్లను దృఢంగా మార్చుకోవడానికి ఈ ప్రొటీన్‌ మాస్క్‌ని ప్రయత్నించండి. దీనిని ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం రండి...

ఒక బాటిల్‌లో కప్పు పెరుగు తీసుకొని అందులో రెండు టేబుల్‌ స్పూన్ల ఆముదం నూనె, ఒక టేబుల్‌ స్పూన్‌ ఆలివ్‌ నూనెని వేయండి. అలాగే ఒక గుడ్డులోంచి తీసిన తెల్లసొనని కూడా జత చేయండి. ఈ మిశ్రమాన్ని బాగా షేక్‌ చేస్తే మీకు నురగ లాంటి పదార్థం వస్తుంది. దానిలో అర చెక్క నిమ్మరసాన్ని కలపండి. ఈ ప్యాక్‌ని మొదట జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఆపై మిగిలిన మిశ్రమాన్ని జుట్టంతా అప్లై చేసుకోవచ్చు.

ఇలా ప్యాక్‌ వేసుకున్న తర్వాత జుట్టుని ముడివేసుకుంటే మిశ్రమం కిందికి జారిపోకుండా ఉంటుంది. కనీసం 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆపై మొదట సాధారణ నీటితో శుభ్రం చేసుకొని.. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా కనీసం వారానికి రెండు సార్లు చేస్తే కొంత కాలానికి చక్కటి ఫలితం కనిపిస్తుంది.

ఇదీ చదవండి:భగీరథ పైపులైన్ లీక్​... వృథాగా పోయిన తాగునీరు

ABOUT THE AUTHOR

...view details