తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

అమ్మాయిలూ జిమ్‌కు వెళ్తున్నారా... అయితే ఈ జాగ్రత్తలు పాటించండి..

జిమ్‌లు తెరిచేశారు. వర్కవుట్లు మొదలయ్యాయి. అయితే జిమ్‌కు వాడే వస్తువులు, వాటి శుభ్రత విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నారా...

gym
gym

By

Published : Aug 7, 2020, 8:14 AM IST

గ్లోవ్స్‌: చేతులకు సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పించే గ్లోవ్స్‌ని వ్యాయామం తర్వాత షాంపూ వేసిన నీటిలో నానబెట్టి ఉతికేయాలి.

స్పోర్ట్స్‌ బ్రా:నాణ్యమైన వాటిని మాత్రమే ఎంచుకోవాలి. గోరువెచ్చటి నీటిలో గాఢత తక్కువగా ఉండే డిటర్జెంట్‌ వేసి వీటిని నానబెట్టాలి. తర్వాత చేతులతో మృదువుగా రుద్దుతూ శుభ్రం చేస్తే సరిపోతుంది.

యోగా మ్యాట్‌:కప్పు డిస్టిల్డ్‌ వాటర్‌లో కొన్ని చుక్కల ఎసెన్షియల్‌ ఆయిల్‌ వేసి కీన్లింగ్‌ సొల్యూషన్‌ను తయారుచేసుకోవాలి. దీన్ని స్ప్రే బాటిల్‌లో పోసుకోవాలి. వర్కవుట్‌, యోగ చేసిన ప్రతిసారీ మ్యాట్‌ అంతా స్ప్రే చేయాలి. ఆ తర్వాత శుభ్రమైన వస్త్రంతో తుడిచేస్తే సరి.

ప్రొటీన్ షేక్ బాటిల్స్‌:జిమ్‌కు వెళ్లే వారి వెంట ఉండే వస్తువుల్లో ఇదొకటి. దీన్ని కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండాలి. లేదంటే దుర్వాసన వస్తుంది. కప్పు వేడి నీటిలో కొన్ని చెంచాల ఆపిల్ సిడార్ వెనిగర్ వేసి రాత్రంతా అలా వదిలేయాలి.

స్పోర్ట్స్ షూస్:జిమ్‌లో ఎక్కువగా ప్రభావితం అయ్యేవి ఇవే. వ్యాయమం తర్వాత వీటిని ఎండలో పెట్టాలి. అలా చేస్తే దుర్వాసన పోతుంది. తరచూ శుభ్రం చేస్తూ ఉండే ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

ABOUT THE AUTHOR

...view details