తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

యాలకుల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి.. అవేంటంటే!

యాలకుల్ని మనం తీపి పదార్థాల తయారీలో ఎక్కువగా వాడుతుంటాం. చక్కటి సువాసన కలిగి అదనపు రుచి తెచ్చే వీటిలో ఎన్నో పోషకాలూ ఉన్నాయి. అవేంటంటే!

There are many nutrients in ilachi
యాలకుల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి.. అవేంటంటే!

By

Published : Sep 5, 2020, 9:31 AM IST

యాలకుల్లో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును అదుపు చేస్తాయి. క్యాన్సర్​ కారక కణాలు పెరగకుండా నిరోధిస్తాయి. వీటిలోని యాంటి ఇన్​ఫ్లమేటరీ గుణాలు ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఆరోగ్యకరమైన కణాల అభివృద్ధికి తోడ్పడతాయి.

  • భోజనం చేసిన తర్వాత రెండు యాలకులను నోట్లో వేసుకుంటే చాలు.. తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణం అవుతుంది. వీటికి జీర్ణశక్తిని మెరుగుపరిచే గుణం మెండుగా ఉంది. వికారం, వాంతి వచ్చినట్లు అనిపిస్తే రెండు యాలకులు తిని చూడండి. ఫలితం మీకే తెలుస్తుంది. యాలకుల్లో ఉండే ఔషధగుణాలు చెడు బ్యాక్టీరియాతో పోరాడతాయి. ఇవి నోటి దుర్వాసన తగ్గించి చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.
  • ఊపిరితిత్తులకు ఆక్సిజన్​ సరఫరాను మెరుగుపరిచి, శ్వాస సంబంధిత సమస్యల బారిన పడకుండా కాపాడే శక్తి యాలకులకు ఉంది. రక్తంలో చక్కెర శాతం తక్కువ ఉన్నవారు రోజూ రెండు యాలకులు తింటే ఈ సమస్యకు దూరంగా ఉండొచ్చు. యాలకుల్లోని పోషకాలు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

ABOUT THE AUTHOR

...view details