కావాల్సినవి
మామిడి పండు గుజ్జు - అరకప్పు
మామిడి పండు ముక్కలు - అరకప్పు
ఐస్ ముక్కలు- అరకప్పు
కొబ్బరి పాలు - పావు కప్పు
నిమ్మరసం - టేబుల్‌స్పూన్
తయారీ
కొన్ని మామిడి ముక్కలను పక్కన పెట్టి మిగిలినవాటిని మామిడి పండు గుజ్జు, ఐస్, కొబ్బరి పాలు, నిమ్మరసంతో పాటు బ్లెండర్‌లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత మిగిలిన మామిడి ముక్కలను అందులో వేసుకొని సర్వ్ చేసుకుంటే సరి..
కావాల్సినవి
చక్కెర - అర కప్పు
నీళ్లు - అర కప్పు
పుచ్చకాయ ముక్కలు - నాలుగు కప్పులు
చల్లని నీరు - మూడు కప్పులు
ఐస్ ముక్కలు - పన్నెండు
నిమ్మరసం - అర కప్పు
తయారీ
ముందుగా పుచ్చకాయ ముక్కలను మిక్సీ పట్టుకొని వడకట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో అర కప్పు చక్కెర వేసి అందులో అర కప్పు నీళ్లు పోసి కరగనివ్వాలి. ఇది కరిగిన తర్వాత దింపి కాస్త చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఇందులో చల్లని నీళ్లు, నిమ్మరసం వేసుకోవాలి. ఇప్పుడు గ్లాసుల్లో ఇందాక వడకట్టుకొని పెట్టుకున్న పుచ్చకాయ రసాన్ని పోసి, దాని పై నుంచి ఈ నిమ్మరసాన్ని పోయాలి. ఇందులో ఐస్ వేసి ఒకసారి కలిపి సర్వ్ చేసుకుంటే సరి..
కావాల్సినవి
కొబ్బరి పాలు - కప్పు
బొప్పాయి ముక్కలు - మూడు కప్పులు
చక్కెర - అర కప్పు
ఐస్ ముక్కలు - రెండు కప్పులు
తయారీ
కొబ్బరి పాలు, బొప్పాయి ముక్కలు, చక్కెర, సగం ఐస్‌క్యూబులను బ్లెండర్‌లో వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది స్మూతీలా తయారైన తర్వాత దీన్ని గ్లాసుల్లో పోసి మిగిలిన ఐస్ ముక్కలను వేసి సర్వ్ చేసుకోవాలి.