పగటివేళలో కన్నా రాత్రిపూట బీపీ ఎక్కువగా ఉండటం వల్ల మతి మరుపు వచ్చే అవకాశం ఎక్కువ అని స్వీడన్‌లోని ఉప్సల విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఆరోగ్యవంతులకి రోజులో బీపీ రకరకాలుగా ఉన్నప్పటికీ రాత్రిపూట తక్కువగా ఉంటుంది. కొద్దిమందిలో మాత్రం దీనికి భిన్నంగా రాత్రివేళలోనే ఎక్కువ ఉండే అవకాశం ఉందట. ఇది మెదడుమీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
రాత్రిపూట బీపీ ఎక్కువుంటుందా?! - high bp at night time leads to alzheimer's
మతిమరుపు... వినడానికి ఏదో సాధారణ జబ్బులా ధ్వనిస్తుంది కానీ రోజువారీ జీవనంలో చాలా ప్రభావమే చూపిస్తుంది. డిమెన్షియాతో బాధపడే వాళ్లలో క్రమంగా ఆలోచనాశక్తి తగ్గిపోతుంది. తద్వారా సామాజిక జీవనంలో మమేకం కాలేకపోతుంటారు. అయితే దీనికి బీపీ కూడా కారణం కావచ్చట.
రాత్రిపూట బీపీ ఎక్కువుంటుందా?!
ఎందుకంటే.. నిద్రపోయినప్పుడే మెదడు వ్యర్థ పదార్థాలను తొలగించు కుంటుంది. అయితే ఆ సమయంలో బీపీ ఎక్కువగా ఉంటే దాని పనికి ఆటంకం ఏర్పడుతుంది. దాంతో మెదడు పనితీరు తగ్గి మతిమరుపుకి దారి తీస్తుందట. ఇందు కోసం వీళ్లు కొందరు వృద్ధుల్ని ఎంపికచేసి 24 ఏళ్ల పాటు రాత్రీపగళ్లూ గమనించారట. అందులో రాత్రివేళలో బీపీ ఉన్నవాళ్లలో మిగిలినవాళ్లకన్నా మతిమరుపు, ఆల్జీమర్స్ ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
- ఇదీ చూడండి :అధిక రక్తపోటును ఆహారంతో నియంత్రించవచ్చా?