తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

పేరెంట్స్‌లో అలర్జీలుంటే అవి పుట్టే పిల్లలకు వస్తాయా? - చర్మ అలర్జీ

నమస్తే డాక్టర్‌. మా వారికి చర్మ అలర్జీ ఉంది. అదే సమస్య మా పాపకి కూడా ఉంది. వారిద్దరిదీ ఓ పాజిటివ్ బ్లడ్‌ గ్రూప్‌. కానీ నాది ఓ నెగిటివ్. ఇప్పుడు మేము మరో బేబీ కోసం ప్లాన్‌ చేసుకోవాలనుకుంటున్నాం. కానీ పుట్టబోయే బేబీలో కూడా ఈ సమస్య వస్తుందేమోనని భయంగా ఉంది. అది ఎంత వరకు నిజం? మేం ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకోవచ్చా? సలహా ఇవ్వండి. - ఓ సోదరి

gynecologist-advice-on-skin-allergy
పేరెంట్స్‌లో అలర్జీలుంటే అవి పుట్టే పిల్లలకు వస్తాయా?

By

Published : Apr 6, 2021, 12:57 PM IST

మామూలుగా అలర్జీలనేవి వంశపారంపర్యంగా రావచ్చు. అయితే ఇప్పుడున్న పాపకి అదే సమస్య వచ్చింది కాబట్టి పుట్టబోయే బేబీలో వస్తుందా, రాదా తెలియాలంటే.. అసలు మీ వారి చర్మ సమస్యేంటో ముందుగా తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఇది వంశపారంపర్యంగా వచ్చేదా, కాదా అన్నది చెప్పడానికి వీలవుతుంది. అందుకే మీ వారిని, పాపను ఒకసారి చర్మవ్యాధి నిపుణులకు చూపించి సరైన వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి.

ఆ తర్వాత ఆ రిపోర్టులన్నీ తీసుకొని జెనెటిక్‌ కౌన్సెలింగ్‌కి వెళ్తే.. పుట్టబోయే బిడ్డకు అలర్జీ వచ్చే అవకాశం ఎంత వరకు ఉందో వాళ్లు చెప్పగలుగుతారు. మీరు భయపడుతున్నట్లు ఇది బ్లడ్‌ గ్రూప్‌ మీద ఆధారపడి ఉండదు. ఏదేమైనా రెండో ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్‌ చేసుకోవడం కోసం ఎలాంటి ఇబ్బందులు లేకపోవడమే మంచిది. అలాగే అలర్జీ అనేది ప్రమాదకరమైంది కాదు.. కాబట్టి మీరు దాని గురించి అంత సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం లేదు.-డా.వై.సవితాదేవి, గైనకాలజిస్ట్​

ఇదీ చూడండి:పుస్తకాలు కొనండి.. ఫీజులూ కట్టండి

ABOUT THE AUTHOR

...view details