తెలంగాణ

telangana

By

Published : Apr 8, 2021, 3:33 PM IST

ETV Bharat / lifestyle

నాజూకైన చేతుల కోసం ఇలా ట్రై చేయండి

స్నేహితురాలు వేసుకున్న టాప్‌ రష్మికి చాలా నచ్చేసింది. ఎంతో ముచ్చటపడి సరిగ్గా అలాంటిదే కొనుక్కుంది. అంతా సరిపోయిందిగానీ చేతులు దగ్గర మాత్రం పట్టేసింది. చాలామందికి శరీరమంతా సన్నగానే ఉన్నా ఇలా చేతులు మాత్రం లావుగా ఉంటాయి. ఇలాంటి వారందరికీ ఈ వ్యాయామాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

exercise for slim hands
నాజూకైన చేతుల కోసం...

చేతులను ముందుగా భుజాలకు సమానంగా చాపి పైకి లేపి కిందకు తీసుకురావాలి. ఇలా పదిసార్ల చొప్పున మూడు సెట్లు చేయాలి. దీంతో చేతుల దగ్గర ఉండే కండరాలు వదులవుతాయి.
*రెండు చేతులతో బరువైన వస్తువును ముందుకు తోస్తున్నట్లు చేయాలి. ఆ తర్వాత దాన్ని వెనక్కు లాగుతున్నట్టు చేయాలి. ఇలా చేస్తున్నప్పుడు చేతులు తలకంటే పైకి ఉండేలా చూసుకోవాలి.
*భుజాలకు సమానంగా చేతులను చాపి తర్వాత ముందుకు తీసుకొచ్చి... ఒక చెయ్యి మీద మరో చెయ్యి పెట్టాలి. చేతులు ‘ఎక్స్‌’ ఆకారంలో ఉండేలా చూసుకోవాలి. ఇలా విడతకు పది చొప్పున మూడు సార్లు చేయాలి.
*నిటారుగా నిలబడి చేతులను పైకి ఎత్తి నమస్కార ముద్రలో ఉంచాలి. వాటిని అదే స్థితిలో ఉంచి వెనక్కు మెడ కింద వరకూ తీసుకెళ్లాలి. ఈ స్థితిలో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. ఇలా ఇరవై చొప్పున మూడుసార్లు చేయాలి. నేరుగా చేతులను వీపు వెనక పెట్టి కూడా నమస్కార ముద్ర వేయొచ్చు.
*చేతులను పక్కకు చాపి వేళ్లను మూసి... గుప్పిటని సవ్య, అపసవ్య దిశల్లో తిప్పాలి. ఇలా ఇరవైసార్లు చేస్తే విశ్రాంతి లభిస్తుంది.
ఈ వ్యాయామాలకు క్రమం తప్పకుండా కొన్ని రోజులు చేస్తే తేడా స్పష్టంగా మీకే తెలుస్తుంది.

ABOUT THE AUTHOR

...view details