ఉల్లికాడల నుంచి శరీర ఆరోగ్యానికి అవసరమయ్యే కొన్ని కీలక ఖనిజాలు లభిస్తాయి. వాటిల్లో కాపర్, మెగ్నీషియం, పొటాషియం, క్రోమియం, మాంగనీస్‌లతోపాటూ బి విటమిన్లూ ఉన్నాయి. ఈ కాడల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలున్నాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శ్వాసకోస సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దగ్గు, జలుబు వంటివి అదుపులో ఉంటాయి.
ఉల్లికాడలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు...! - Spring onions uses
ఉల్లికాడల్లో ఎన్నో పోషకాలు, ఖనిజాలు లభిస్తాయి. శరీర ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం.. వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉల్లికాడలతో ఇంకా ఏం ప్రయోజనాలు ఉన్నాయో కింది కథనం చదివి తెలుసుకోండి.
ఉల్లికాడలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు...!
ఈ కాడల్లోని ఆల్లీప్రొఫైల్‌డైసల్ఫైడ్ అనే రసాయనం గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉల్లిపొరకని ఆహారంలో చేర్చుకోవడం వల్ల చక్కని ఫలితాలు ఉంటాయి. కారణం దీనిలో క్రోమియం రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలని క్రమబద్ధీకరిస్తుంది. దీనిలోని సల్ఫర్ బీపీని అదుపులో ఉంచుతుంది.