అందం, అభినయం, ఆహార్యంతో ఫ్యాషన్ ప్రియులను మోడల్స్ మంత్రముగ్ధులను చేశారు. సంప్రదాయ, ఆధునికత కలబోసిన దుస్తుల్లో అదరగొట్టారు. ఔత్సాహికులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ..ఫిప్త్ అవెన్యూ ఈవెంట్ మేనేజ్‌మెంట్.. ఆధ్వర్యంలో ఇండియా లైఫ్‌స్టైల్ అండ్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్‌ను నిర్వహిస్తున్నారు.
లైఫ్‌స్టైల్ అండ్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్‌లో యువతీ యువకుల సందడి - ఫ్యాషన్ వీక్
ఫ్యాషన్ రంగంలో ఔత్సాహికులను ప్రోత్సాహించేందుకు ఫిఫ్త్ అవెన్యూ ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో ఇండియా లైఫ్‌స్టైల్ అండ్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ నిర్వహించారు. దాదాపు 40 మంది యువతి, యువకులు పాల్గొని అలరించారు.
లైఫ్‌స్టైల్ అండ్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్‌లో యువతీ యువకుల సందడి
హైటెక్ సిటీలో మూడు రోజుల పాటు జరిగే ఈ ఫ్యాషన్ వేడుక కోసం జాయ్స్ ఆర్ట్ గ్యాలరీలో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. 40 మంది యువతీ, యువకులు పాల్గొని ప్రతిభను చాటారు. క్యాట్‌వాక్‌తో అలరించారు. దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రక్రియ ద్వారా తుది పోటీలకు 30 మందిని ఎంపిక చేస్తామని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి:బిర్యానీ రుచికి తలపాగా చుట్టారు!