హైదరాబాద్ గచ్చిబౌలిలో నూతనంగా ఏర్పాటు చేసిన ట్రూఫిట్ అండ్ హిల్ సెలోన్లో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. అందమైన ముద్దుగుమ్మలు తమ హంస నడకలతో ఫ్యాషన్ ప్రియులను మంత్రముగ్ధులను చేశారు. సినీ నటుడు సూర్య శ్రీనివాస్ ప్రారంభించిన ఈ సెలోన్లో ప్రత్యేక ఫ్యాషన్ షో నిర్వహించారు.
మెరిసిన ముద్దుగుమ్మలు.. ర్యాంపుపై హొయలు - fashion show in hyderabad
నగరంలో చాలా రోజుల తర్వాత ర్యాంపుపై ముద్దుగుమ్మలు మెరిశారు. హంస నడకలతో హొయలొలికించారు. అందాలతో మంత్రముగ్ధుల్ని చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో కొత్తగా ప్రారంభించిన ట్రూఫిట్ అండ్ హిల్ సెలోన్లో ఫ్యాషన్‌షో కార్యక్రమం ఆకట్టుకుంది.
fashion show held in gacchibowli thrupit salon
కరోనా కారణంగా లైఫ్ స్టైల్ కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే మళ్లీ ప్రారంభం కావడం సంతోషంగా ఉందని సూర్య శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే నగరంలో సాధారణ పరిస్థితులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
బ్రిటన్‌కు చెందిన అతి పురాతనమైన బ్యూటీ స్పాను నగరవాసులకు అందుబాటులోకి తీసుకు రావడం చాలా ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. అన్ని రకాలైన సేవలను వినియోగదారులకు అందించనున్నట్లు వివరించారు.