తెలంగాణ

telangana

By

Published : Sep 7, 2020, 10:45 AM IST

ETV Bharat / lifestyle

ఆవనూనెతో.. అందమైన చర్మం, ఒత్తయిన జుట్టు మీ సొంతం..

మనం దాదాపుగా ఆవాలు లేకుండా వంటకాలు చేయమేమో... అయితే వాటివల్ల ఆరోగ్యమే కాకుండా అందాన్నీ పెంచుకోవచ్చని ఎంతమందికి తెలుసు? అందమైన చర్మం కోసం, ఒత్తయిన జుట్టుకోసం ఆవాల్ని ఎలా ఉపయోగించొచ్చంటే!

olive oil
ఆవనూనెతో.. అందమైన చర్మం, ఒత్తయిన జుట్టు మీ సొంతం..

  • రోజూ స్నానం చేయడానికి ముందు ఆవనూనెను ముఖానికి రాసుకుని కాసేపయ్యాక కడిగేయండి. ఆవాల్లో విటమిన్‌ ఇ ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మంపై ముడతలు తగ్గిస్తుంది. మంచి సన్‌స్క్రీన్‌ లోషన్‌లా కూడా ఉపయోగపడుతుంది.
  • ఆవనూనెలో చెంచా సెనగపిండీ, కాస్త పెరుగు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముఖంపై ఉన్న నల్ల మచ్చలు తగ్గుతాయి. చర్మం మృదువుగా తయారవుతుంది.
  • ఆవనూనెలో కొంచెం కొబ్బరి నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి. మునివేళ్లతో చర్మంపై మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. మొటిమలు రాకుండా ఉంటాయి. చర్మం నిర్జీవంగా కనిపిస్తున్నప్పుడు పావుకప్పు ఆవనూనెలో రెండు చుక్కల రోజ్‌ ఆయిల్‌ని కలపాలి. దీనికి చెంచా బియ్యప్పిండి చేర్చి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ఒంటికి రాసుకుని నలుగులా రుద్దుకోవాలి. ఇది సహజమైన స్క్రబ్‌లా పనిచేస్తుంది. మృతకణాలు తొలగి మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.

ABOUT THE AUTHOR

...view details