గజల్ అలగ్‌ది హరియాణాలోని గురుగ్రామ్. భర్త వరుణ్. తమ జీవితంలోకి పండంటి బిడ్డని ఆహ్వానించాలని నిర్ణయించుకున్న ఈ జంట....పుట్టబోయే చిన్నారికోసం అవసరమైన వస్తువుల శోధన ముందే మొదలుపెట్టింది. ఆ క్రమంలోనే బుజ్జాయిలకి వాడే చాలా ఉత్పత్తులు హానికారక రసాయనాల సమ్మేళనం అని గుర్తించింది. భర్తతో కలిసి రసాయనాలు కలపని వాటికోసం ఇంటర్నెట్‌లో శోధించింది గజల్. మార్కెట్‌లు తిరిగింది. కానీ వారికి నిరాశే ఎదురైంది. ఈలోగా నెలలు నిండి ప్రసవమయ్యింది. ఇక తప్పక అమెరికా నుంచి వాటిని తెప్పించుకోవడం మొదలుపెట్టారు. ఇవి ఖరీదుతో కూడుకున్నవి... తెప్పించుకోవడమూ కాస్త కష్టమైన విషయంగా అనిపించింది. ఎలాగైనా దానికి పరిష్కారం వెతకాలనుకుంది. భర్త తన ఆలోచనని సమర్థించాడు. దాంతో వారి బిడ్డకే కాదు... తల్లీపిల్లలందరికీ ఉపయోగపడేలా అలాంటి ఉత్పత్తులు తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చారు ఇద్దరూ. అలా 2016లో ‘మామా ఎర్’్త సంస్థను ప్రారంభించారు. దీనిద్వారా తల్లీబిడ్డల సంరక్షణ కోసం స్వచ్ఛమైన చర్మ, కేశ ఉత్పత్తుల తయారీ ప్రారంభించారు.
సవాళ్లెన్నో... ఆలోచన వచ్చింది...దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నంలో వీరికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఆరునెలలపాటు వీరు నిద్రలేని రాత్రుళ్లు గడిపారు. డాక్టర్లు, ఆయుర్వేద నిపుణుల సాయంతో వివిధ పద్ధతుల్లో ఉత్పత్తుల తయారీ మొదలుపెట్టారు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అవి తుదిరూపు దిద్దుకున్నాయి. ఆపై అన్ని అనుమతులూ తీసుకుని సంస్థ ప్రారంభించారు. ఈ నిర్ణయానికి ముందు ‘ఈ పని చేయాలా వద్దా’ అని చాలా ఆలోచించారు. వీళ్లని ఎక్కువగా ప్రభావితం చేసిన చిత్రం ‘త్రీ ఇడియట్స్’. అందులోని హీరోలా మనసుకు నచ్చిన పని మాత్రమే చేయాలనుకున్నారు. అందుకే కోకాకోలా సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పనిచేసిన వరుణ్ దీని కోసం ఆ ఉద్యోగాన్నీ తేలిగ్గా వదిలేశాడు. గజల్ గతంలో పెయింటింగ్ స్టూడియోను నడిపేది. ఆమె దాన్ని వదులుకుంది. మొదట్లో వీరి ఆలోచన చూసి చాలామంది ‘హాయిగా ఉద్యోగం చేసుకోక ఎందుకీ కష్టం’ అంటూ నిరుత్సాహపరిచేవారు. అయినా వెనకడుగు వేయలేదు.
అందరికీ అందుబాటులో...