ఎలాన్ అంటే అంతులేని... అలుపు లేని ఉత్సాహం. ఎంతో మేధోమథనం తర్వాత ఐఐటీయన్లు ఫ్రెంచ్ భాష నుంచి ఈ పదాన్ని ఎంపిక చేశారు. ఇందులో విద్యా సంబంధిత అంశాలకు ఎంత ప్రాధాన్యముందో, సాంస్కృతిక అంశాలకు అంతే స్థాయిలో ఉంటుంది. ఎలాన్-ఎన్విషన్ పేరుతో ప్రతి ఏటా మూడు రోజుల పాటు దీనిని నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తమలో ఉన్న ప్రతిభను ప్రదర్శించే వేదిక ఇది. 2010లో తొలిసారిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
సంవత్సరమంతా కసరత్తు:
విద్యార్థులు కేవలం చదువుల్లోనే కాదు... అన్ని రంగాల్లోనూ తమ సత్తాను నిరూపించుకునేలా విద్యా, సాంస్కృతిక, వినోదం, సామాజిక అంశలపై పోటీలు, చర్చలు ఉంటాయి. ఇందుకోసం ఐఐటీ విద్యార్థులు సంవత్సరం మొత్తం కసరత్తు చేస్తారు. ప్రత్యేకంగా కమిటీలు వేసుకుని.. వాటి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఎలాన్ కార్యక్రమం రెండో రోజైన శనివారం.. హ్యాక్‌థాన్, ఐవోటీ, కృత్రిమ మేధస్సుపై సదస్సులు, సరదా ఆటలు నిర్వహించారు. రోబో వార్.. మెర్సిడస్ బెంజ్ ఇంజన్ల ప్రత్యేకతపై సమీక్షతో పాటు ఇండియా హిప్ పాప్ 2019 సెలక్షన్స్ నిర్వహించారు.
ఇప్పటికే దేశం నలుమూల నుంచి ఆరు వేల మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. నేడూ ఎక్కువ మంది పాల్గొనే అవకాశం ఉంది.
ఇవీ చదవండి:
మంత్రివర్గంలోకి మహిళలు