క్యాన్సర్ బాధితుల సహాయార్థం హైదరాబాద్లో నిర్వహించిన ఆర్ట్ విత్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంది. నగరంలోని మారియట్ హోటల్‌లో విజువల్ ఇంటర్నేషనల్ ఆర్ట్ గ్యాలరీ, సహాయ ఫౌండేషన్ సంయుక్తంగా అవంత్రడే పేరిట ఆర్ట్ విత్ ఫ్యాషన్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ చిత్రకారుడు హరి చిత్రకళ ప్రదర్శనతో పాటు యువ డిజైనర్లు రూపొందించిన సరికొత్త ఉత్పత్తులను ప్రదర్శించారు.
ఆకట్టుకున్న 'ఆర్ట్ విత్ ఫ్యాషన్' కళాఖండాలు.. అలరించిన మోడళ్లు - ఫ్యాషన్ షో
హైదరాబాద్లో నిర్వహించిన ఆర్ట్ విత్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్... చిత్రకళా ప్రియులను ఆకట్టుకుంది. అవంత్రడే పేరిట ఏర్పాటు చేసిన ఆర్ట్ విత్ ఫ్యాషన్ ప్రదర్శనలో... మగువల మనోభావాలు, ప్రకృతి అందాలు, మానవ సంబంధాలతో పాటు పలువురు ప్రముఖల చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఫ్యాషన్ షోలో పలువురు మోడల్స్ తమ అందచందాలతో అలరించారు.
చిత్రకారుడు హరి తన 94వ ప్రదర్శనగా ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో మగువల మనోభవాలు, ప్రకృతి అందాలు, మానవ సంబంధలతో పాటు పలువురు ప్రముఖల చిత్రాలు... ఆహుతులను మంత్రముగ్ధులను చేశారు. యువ డిజైనర్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో పలువురు మోడల్స్ తమ అందచందాలతో అలరించారు. కొవిడ్ కారణంగా ప్రతి ఒక్కరు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... వారికి తమ వంతుగా సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రదర్శను ఏర్పాటు చేసినట్లు నిర్వహకురాలు అనిత తెలిపారు. కరోనా సమయంలో చిన్నారుల వైద్య కోసం, పేద బాలిబాలికల విద్య కోసం ప్రదర్శనలు నిర్వహించినట్లు తెలిపారు.