కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో గుర్తు తెలియని రైలు ఢీకొని యువకుడు మృతి చెందాడు. సంజీవయ్య కాలనీ సమీపంలో గుర్తు తెలియని రైలు ఢీకొని యువకుడు మృతి చెందాడని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకుని రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు.
రైలు ఢీకొని యువకుడు మృతి - train accident
రైలు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన కాగజ్నగర్ పట్టణంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
రైలు ఢీకొని యువకుడు మృతి
మృతదేహంపై ఉన్న ఆనవాళ్లు, స్థానికులు తెలిపిన సమాచారంతో మృతుడు కాగజ్నగర్ అశోక్ కాలనీకి చెందిన కిరణ్ (21)గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని యువకుడు ప్రమాదవశాత్తు మరణించాడా.. లేక ఇతరత్రా కారణాల వల్ల చనిపోయాడా అనే కోణాల్లో విచారణ చేపట్టారు.
ఇవీ చూడండి: సినిమా కథను మించిన థ్రిల్లర్ స్టోరీ... నేపాల్ గ్యాంగ్ చోరీల మిస్టరీ