తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సొమ్ము స్వాహా చేశారని... కలెక్టరేట్ ఎదుట యువకుడు ఆత్మహత్య - AP Crime News

కలెక్టరేట్‌ ఎదుట యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లి పొదుపు డబ్బులను అధికారులు స్వాహా చేశారని యువకుడు ఆరోపిస్తూ.. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

man commits suicide in front of collectorate office in ananthapuram
కలెక్టరేట్ ఎదుట యువకుడు ఆత్మహత్య

By

Published : Oct 12, 2020, 1:01 PM IST

కలెక్టరేట్ ఎదుట యువకుడు ఆత్మహత్య

ఆంధ్రప్రదేశ్​ అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించి.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. తన తల్లి పొదుపు డబ్బులను అధికారులు స్వాహా చేశారని ఆరోపిస్తూ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

బాధితుడు నార్పల మండలం గూగూరు వాసి రామకృష్ణారెడ్డిగా గుర్తించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

ఇదీ చూడండి: రాయదుర్గం చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్టు

ABOUT THE AUTHOR

...view details