కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లోని శుభాష్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఇంటి స్థలం విషయంలో తలెత్తిన వివాదంలో స్థానికుల వేధింపులు తాళలేక శ్రవణ్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుభాష్ కాలనీలో నివాసం ఉండే రామిల్ల రాజేశ్వరి రామయ్యలకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్న కొడుకు శ్రవణ్ జిడిచెను గ్రామ శివారులో శనివారం ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
చర్యలు తీసుకోవాలి...
బాధితులకు కొన్ని రోజులుగా ఇంటి స్థలం విషయంలో స్థానికులతో వివాదం జరుగుతోంది. శ్రవణ్, స్థానిక కౌన్సిలర్ తో పాటు మరో ఇద్దరిపై స్థల వివాదంలో కేసు నమోదైంది. కేసు వల్ల భవిష్యత్తులో ఉద్యోగం రాదని, డబ్బులు ఇస్తే కేసు మాఫీ చేయిస్తామని కొందరు తమ కుమారుడిని బెదిరించారని తల్లి రాజేశ్వరి ఆరోపించారు. ఆ బెదిరింపులు తాళలేక శ్రవణ్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి:అదునపు కట్నం కోసం భర్త వేధింపులు.. భార్య ఆత్మహత్య