ఆసిఫ్‌నగర్ హుడాకాలనీలో శ్రవణ్(25) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో ఉన్న స్నేహితులే హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎదురింట్లో నిన్న పెళ్లి జరగ్గా.. మిత్రులంతా కలిసి మద్యం సేవించారు. రాత్రి 2:30 నిమిషాల సమయంలో వీరి మధ్య గొడవ జరగ్గా.. హాకీ స్టిక్, కత్తులతో దాడి చేసి శ్రవణ్‌ను దారుణంగా హతమార్చారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆసిఫ్‌నగర్‌లో దారుణ హత్య.. మిత్రులే చంపారా? - asif nagar murder
హైదరాబాద్ ఆసిఫ్‌నగర్ పరిధి హుడా కాలనీలో ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో స్నేహితులే హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆసిఫ్‌నగర్‌లో దారుణ హత్య.. మిత్రులే చంపారా?
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:అదను చూసి రైతులపై భారం మోపుతున్న కంపెనీలు