యువకుడిని కత్తితో పొడిచి హత్య.. వెలుగులోకి సీసీ పుటేజ్... - latest news in Guntur
ఆర్థిక లావాదేవీల కారణంగా యువకుడిని ఓ వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘటన ఏపీ గుంటూరు జిల్లాలోని తెనాలి మండలం నందులపేటలో జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
యువకుడిని కత్తితో పొడిచి హత్య.. వెలుగులోకి సీసీ పుటేజ్...
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలి మండలం నందులపేటలో దారుణం జరిగింది. నవయుగ బార్అండ్ రెస్టారెంట్ వద్ద సుభాని అనే యువకుడిని..... రఫీ అనే వ్యక్తి కత్తితో పొడిచి హత్యచేశాడు. అయితే 16 వేల అప్పు విషయంలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసిన తెనాలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.