రంగారెడ్డి జిలా కొండాపూర్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలోని సుబ్బయ్య అపార్ట్‌మెంట్‌లో రాఘవేంద్రరావు, శేష సంతోష కుమారి దంపతులు నివాసముంటున్నారు. వీరికి ఫిబ్రవరి 15వ తేదీన వివాహం జరిగింది.
భవనం పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్య - రాఘవేంద్రకాలనీలో మహిళ ఆత్మహత్యం
ఓ మహిళ తాను ఉంటున్న అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
భవనం పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్య
లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న వీరి మధ్య మంగళవారం గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన ఆమె బుధవారం వారు ఉంటున్న అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఘటన స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.