మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నేరేడ్మెట్ భగత్‌సింగ్‌నగర్‌లో నివాసముంటున్న సుజాత అనే మహిళ కలెక్టరేట్ ప్రాంగణంలో ఆత్మహత్యాయత్నం చేసింది. తనకు డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయించడం లేదని.. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదనే ఆవేదనతో పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి యత్నించింది.
'ఇల్లు కేటాయించడం లేదని ఆత్మహత్యాయత్నం' - medchal district crime news
అధికారులు తనకు డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయించడం లేదని ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. కలెక్టరేట్ ప్రాంగణంలో పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి యత్నించింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది.
'డబుల్ బెడ్ రూం కేటాయించడం లేదని ఆత్మహత్యాయత్నం'
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని.. డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయించాలని ఎన్నిసార్లు అధికారుల చుట్టు తిరిగినా పట్టించుకోకపోవడం వల్ల ఆత్మహత్యాయత్నం చేసినట్లు సుజాత తెలిపింది. ఈ మేరకు పోలీసులు బాధితురాలికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.
ఇదీ చూడండి: మహిళా రైతుపై సర్పంచ్ దాడి... రక్షణ కల్పించాలని వేడుకోలు