ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నాచారంలో విద్యుతాఘాతంతో ఓ మహిళ మరణించింది. గ్రామానికి చెందిన బానోతు చిన్ని అనే మహిళా రైతు తమ పత్తి చేనులో కోతుల కాపాలాకు వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి వీచిన భారీ గాలులకు 33కేవీ విద్యుత్‌లైన్ తీగలు తెగి... ఫెన్సింగ్ తీగలపై పడటం వల్ల విద్యుత్ సరఫరా అయింది.
ఫెన్సింగ్ దాటుతుండగా విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి
పొలానికి వెళ్దామని బయలుదేరిన మహిళా రైతు... అక్కడికి చేరేలోపే ప్రాణాలు విడిచింది. చేనుకు వేసిన కంచేనే రైతును పొట్టనబెట్టుకుంది. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నాచారంలో జరిగింది.
women farmer died with current shock in khammam
అది గమనించని మహిళ... ఫెన్సింగ్ దాటే ప్రయత్నం చేయగా షాక్ తగిలి మృతిచెందింది. భర్తను కోల్పోయిన చిన్ని తానే స్వయంగా వ్యవసాయం చేస్తూ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంది. చిన్ని మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. పోలీస్, విద్యుత్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా చేశారు.