ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్లలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చల్లా రామలక్ష్మి, నాగరాజుకు పన్నెండేళ్ల క్రితం వివాహమయింది. వీరికి ముగ్గురు సంతానం. ఈ నెల 8న రామలక్ష్మీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరుసటి రోజు భర్త నాగరాజు పరీక్ష చేసుకోగా... ఆయనకు పాజిటివ్‌గా తేలింది.
దంపతుల మధ్య కరోనా గొడవ... తెల్లారే భార్య ఆత్మహత్య - corona news
భార్యకు కొవిడ్ సోకిన మరుసటి రోజో భర్తకు నిర్దరణ అయింది. నీ వల్లే నాకూ కరోనా వచ్చిందంటూ భార్యతో భర్త గొడవకు దిగాడు. చివరకు ఏమైందో ఏమో... భార్య విగతజీవిగా ఉరికి వేలాడుతూ కనిపించింది. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లా తనికెళ్లలో చోటు చేసుకుంది.
10న రాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదే గ్రామంలో నివాసముంటున్న తల్లి... ఇద్దరికీ సర్దిచెప్పి వెళ్లింది. మరుసటి రోజు తెల్లవారుజామున పాలు, సరుకులు ఇవ్వడానికి ఆ తల్లి వచ్చి ఎంతసేపు పిలిచినా పలకలేదు. చుట్టుపక్కనవారి సాయంతో లోపలికి వెళ్లి చూడగా... కూతరు విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. వెంటనే కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారమందించింది.
తన బావే చెల్లిని చంపాడని రామలక్ష్మి సోదరుడు ఎల్లయ్య ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మానికి చెందిన అన్నం సేవా ఫౌండేషన్ సభ్యులు మృతురాలి దహన సంస్కారాలు చేశారు.