తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కిరాతకం: భర్త మర్మాంగం కోసి.. ఉరి వేసి.. - wife brutally killed husband in godawari district

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య... భర్తను అతి కిరాతకంగా హతమార్చింది. తాగిన మైకంలో ఆదమరిచి నిద్రిస్తున్న భర్త కాళ్లు, చేతులు, మెడ భాగంలో తాళ్లతో మంచానికి కట్టేసి మర్మాంగాలను కొడవలితో కోసింది. అనంతరం గొంతుకు తాడు బిగించి హత్య చేసింది. ఈ దారణం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

wife brutally murdered her husband in west godavari district andhra pradesh
మర్మాంగం కోసి.. గొంతుకు ఉరి బిగించి

By

Published : Jun 4, 2020, 4:17 PM IST

మర్మాంగం కోసి.. గొంతుకు ఉరి బిగించి

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమ గోదావరి జిల్లా టీ.నర్సాపురం మండలం మక్కినవారిగూడెం గ్రామంలో.. ఓ మహిళ తన భర్తను చంపిన తీరు.. అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. గ్రామానికి చెందిన కటారి అప్పారావు (35) ట్రాక్టర్ డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. అతను మొదట బంధువుల అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కొద్ది కాలానికే వారు విడిపోయారు. అనంతరం తెలంగాణలోని దమ్మపేటకు చెందిన లక్ష్మి ఉపాధి నిమిత్తం మక్కినవారిగూడెం రాగా.. ఆమెను ప్రేమించి పదిహేను ఏళ్ల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక కుమార్తె ఉంది.

ఇదిలా ఉంటే.. మద్యానికి బానిసైన భార్యాభర్తలు తరచూ ఒకరిపై ఒకరు అనుమానాలతో గొడవలు పడుతూ ఉండేవారు. ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకున్నారు. బుధవారం రాత్రి అప్పారావు మద్యం సేవించి ఆదమరిచి నిద్రిస్తుండగా.. అతడిని భార్య లక్ష్మి మంచాని కట్టేసింది. కొడవలితో అతని మర్మాంగాన్ని కోసేసింది. ఆ తరువాత గొంతుకు తాడు బిగించి అతి కిరాతకంగా హత్య చేసింది. అనంతరం ఇంటికి తాళం వేసి పారిపోయింది. గురువారం తెల్లవారుజామున భర్త సోదరుడికి ఫోన్ చేసి 'నేను వేరే ఊరు వెళ్తూ ఇంటికి తాళం వేసి వచ్చాను. మీ తమ్ముడు ఇంట్లోనే ఉన్నాడు. వెళ్లి తలుపులు తీయండి' అని సమాచారం ఇచ్చింది.

సోదరుడు నాగేశ్వరరావు తన ఇద్దరు బంధువులతో కలసి తాళం తీసి చూడగా రక్తపు మడుగులో విగతజీవిగా అప్పారావు పడి ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. భర్తను చంపిన అనంతరం లక్ష్మి టీ.నరసాపురం శివారులో ఉన్నట్లు తెలియగా.. ఆమెను అరెస్టు చేసి పోలీసు స్టేషన్​కు తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజేష్, ట్రైనీ డీఎస్పీ హర్షిత తెలిపారు.

ఇదీ చదవండి:డీఎంహెచ్​ఓ లైంగికంగా వేధిస్తున్నారు: వైద్యురాలు

ABOUT THE AUTHOR

...view details