తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భర్త గోవాలో... భార్య హైదరాబాద్​లో... బెట్టింగ్ దంపతులు అరెస్ట్ - హైదరాబాద్​లో క్రికెట్ బెట్టింగ్

ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి బెట్టింగ్ నిర్వహిస్తున్న దంపతుల గుట్టును పోలీసులు బయటపెట్టారు. రాహుల్ అనే వ్యక్తి గోవాలో ఉంటూ ఈ దందా నడిపిస్తుండగా... అతని భార్య హైదరాబాద్​లో ఉండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వారి నుంచి పది సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకొని ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

wife and husband arrest due to cricket betting in hyderabad
భర్త గోవాలో... భార్య హైదరాబాద్​లో... బెట్టింగ్ దంపతులు అరెస్ట్

By

Published : Oct 24, 2020, 4:32 PM IST

హైదరాబాద్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న భార్యాభర్తల గుట్టు బయటపడింది. మంగళ్‌హాట్‌కు చెందిన రాహుల్‌ దంపతులు బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. రాహుల్‌ గోవాలో ఉంటూ ఈ దందా సాగిస్తుండగా... అతని భార్య మాత్రం హైదరాబాద్‌లో ఉంటూ డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్‌లు నిర్వహిస్తూ... ఉన్నత ఉద్యోగం చేస్తున్నట్టు రాహుల్‌ తన కుటుంబాన్ని నమ్మించాడని వెల్లడించారు.

తాను చెప్పే వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలంటూ రాహుల్‌ తన భార్యకు సమాచారం ఇస్తూ ఉండేవాడని పోలీసులు వివరించారు. ఐపీఎల్‌ మొదలయినప్పటి నుంచి వీరు పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు నిర్వహించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. వీరి వద్ద నుంచి పది సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇదీ చదవండి:యువకుడిని కత్తితో పొడిచి హత్య.. వెలుగులోకి సీసీ పుటేజ్​...

ABOUT THE AUTHOR

...view details