తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వీల్​ స్పిన్​తో ఆఫర్లు... ఆడారో ఖాళీ అవుతాయి మీ అకౌంట్లు - సైబర్​ మోసాల వార్తలు

సైబర్ నేరగాళ్లు రోజుకో తరహాలో వంచనకు తెరలేపుతున్నారు. ప్రజలు కాస్త అవగాహన పెంచుకునే లోపే... కొత్త తరహా సైబర్ మోసాలతో నిండా ముంచుతున్నారు. ఆన్‌లైన్‌లో వీల్ స్పిన్ ఆట ఆడితే బహుమతులు గెలుచుకోవచ్చంటూ అమాయకులకు వల విసురుతున్నారు. నమ్మి వీల్ స్పిన్ ఆడే వారి చరవాణిలోని వివరాలు సేకరించి సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచుకుంటున్నారు.

Wheel Game Cheating cases in Telangana
Wheel Game Cheating cases in Telangana

By

Published : Dec 16, 2020, 3:54 AM IST

వీల్​ స్పిన్​తో ఆఫర్లు... ఆడారో ఖాళీ అవుతాయి అకౌంట్లు

వీల్‌స్పిన్ ఆట అడి సులభంగా బహుమతులు గెలుచుకోండి. ఇటీవల సైబర్ నేరగాళ్లు విసురుతున్న వల ఇది. చరవాణికి లింకులు పంపి... వీల్ స్పిన్ ఆట ఆడే విధంగా అమాయకులకు ఎరవేస్తున్నారు. ప్రజలను ఆకర్షించడానికి వీల్ స్పిన్ గేమ్ ఆహ్వానంపై... ప్రముఖ ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థల గుర్తులను ఉంచుతున్నారు. బిగ్ బిలియన్ డేస్ అంటూ ప్రకటనలిస్తున్నారు. సులభంగా బహుమతులు గెలుచుకోవచ్చనే ఆశతో చాలా మంది సైబర్ నేరగాళ్లు ఉచ్చులో చిక్కుకుని వేలాది రూపాయలు నష్టపోతున్నారు. మొదటిసారి ఆడే వ్యక్తులకు ఒకేసారి బహుమతి రాకుండా... మరోసారి ఆడేలా అవకాశం కల్పిస్తున్నారు. ఎక్స్‌ట్రా స్పిన్ వద్ద నిలిచిపోయే విధంగా చేసి మరోసారి మీట నొక్కాలని సూచిస్తున్నారు. వీల్‌ స్పిన్‌ ఆడే వాళ్లకు లాప్‌టాప్‌, స్మార్ట్‌ వాచ్‌, వీడియో కెమెరా, మొబైల్‌ ఫోన్‌, హెడ్‌ ఫోన్లు, బ్యాగులు గెలుచుకోవచ్చని నమ్మబలుకుతారు.

ఫోన్​ హ్యాక్​ చేసి మరీ...

ఒకవేళ ఏదైనా వస్తువు దగ్గర స్పిన్ నిలిచిపోతే.. ఆ వస్తువు దక్కించుకోవడానికి మీరు కొంతమందికి లింక్‌ పంపాలని నిబంధన విధిస్తారు. ఆ తర్వాత మరో లింకును పంపిస్తారు. ఆ లింక్‌ తెరిచి అందులో సూచించిన విధంగా ముందుకెళ్లాలని నిర్దేశిస్తారు. ఈ క్రమంలో సైబర్‌ నేరగాళ్లు వినియోగదారుడి ఫోన్‌ హాక్ చేస్తారు. ఎనీ డెస్క్​, టీమ్​ వ్యూవర్​, క్విక్​ కనెక్ట్​ వంటి అప్లికేషన్లను పంపించి వాటిని వినియోగదారుడు డౌన్‌లోడ్‌ చేసుకునే విధంగా చూస్తారు. ఆ తర్వాత బ్యాంకు ద్వారా నగదు చెల్లించే విధంగా వినియోదారుడిని ప్రేరేపిస్తారు. ఆ సమయంలో వినియోగదారుడు తన చరవాణిలో నమోదు చేసే బ్యాంకు ఖాతా వివరాలను, ఓటీపీని సైబర్ నేరగాళ్లు గుర్తించి నగదు కాజేస్తున్నారు. మరికొంత మంది బహుమతి రావడానికి కొంత నగదు చెల్లించాలని... కొరియర్ కోసమంటూ అమాయకుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు.

ఏ సంస్థ అల్లాటప్పాగా బహుమతులు ఇవ్వదని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి లింకులను, వీల్‌ స్పిన్‌ గేమ్‌లను నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: ఇంజినీరింగ్ ప్రొఫెసర్... ఏకంగా 15 సార్లు ఓటీపీ చెప్పిన వైనం

ABOUT THE AUTHOR

...view details