వైకాపా అధ్యక్షుడు జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిది సాధారణ మరణం కాదని వైద్యులు తేల్చారు. ఆయన సహాయకుడు అనుమానించినట్టుగానే హత్య అని పోలీసులకు ప్రాథమికంగా నిర్థరించారు.పోస్టుమార్టం చేసిన వైద్యులు.. విస్తుపోయే అంశాలు బయటపెట్టారు.వివేకానందరెడ్డి శరీరంపై 7 గాయాలున్నట్లు తేల్చారు. అందులో నుదుటిపై 2... తల వెనక ఒకటి.. తొడ భాగంలో ఒకటి.. చేతిపై మరో బలమైన గాయాన్ని గుర్తించారు. ఉదయం ఆయన సహాయకుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి సిట్ ఏర్పాటు చేసిన పోలీసులు.. దర్యాప్తులో వేగాన్ని పెంచారు. ఐదు ప్రత్యేక బృందాలను నియమించి విచారణ చేస్తున్నారు. సీఐడీ అదనపు డీజీ అమిత్ గార్గ్ పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతోంది. ఐపీసీ 302 ప్రకారం కేసు నమోదు చేశారు.
'వివేకాది సాధారణ మృతి కాదు'
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మిస్టరీ మృతిని హత్యగా నిర్థారించింది సిట్ బృందం. వైద్యులు అందించిన శవపరీక్ష నివేదిక ఆధారంగా హత్యేనని ప్రాథమికంగా చెప్పారు.
వివేకానందరెడ్డిది హత్యే