తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన గ్రామస్థులు - తెలంగాణ వార్తలు

కోహెడ మండలం తంగళ్లపల్లి నుంచి శనిగరం వెళ్లే దారిలోని పిల్లివాగులో ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై వెళ్తూ ప్రమాదవశాత్తు పడిపోయాడు. గుర్తించిన గ్రామస్థులు అతడిని రక్షించి ప్రాణాలు కాపాడారు.

వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన గ్రామస్థులు
వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన గ్రామస్థులు

By

Published : Sep 27, 2020, 10:36 PM IST

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లి నుంచి శనిగరం వెళ్లే దారిలో పిల్లివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద నీటితో వంతెన మునిగిపోయింది. ఓ వ్యక్తి ద్విచక్రవాహనంతో వంతెన దాటుతూ ఉండగా ప్రమాదవశాత్తు ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గుర్తించిన స్థానికులు అతడిని రక్షించి ప్రాణాలు కాపాడారు.

కోహెడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామం షేర్అలీనగర్​కు చెందిన సయ్యద్ మోతి వంతెన దాటుతూ అదుపుతప్పి వాగులో పడిపోయాడు. అతడిని గుర్తించిన రాజేందర్, జాలిగాం నరేష్ సహా పలువురు గ్రామస్థులు మోతిని బయటకు తీసి ప్రాణం నిలబెట్టారు. ద్విచక్రవాహనానికి తాడుకట్టి లాగి ఒడ్డుకు చేర్చారు. ప్రాణాలు కాపాడిన గ్రామస్థులను పలువురు అభినందించారు.

ఇదీ చూడండి:ప్రేమవివాహం చేసుకున్నాడు.. కుటుంబకలహాలతో శవమయ్యాడు

ABOUT THE AUTHOR

...view details